మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్‌కు మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ దరఖాస్తు..

ఆయన రాజీనామాను ఆమోదించిన తేదీ నుంచి పెన్షన్ వర్తిస్తుందన్న సెక్రటేరియట్ అధికారులు;

Update: 2025-08-31 08:08 GMT
Click the Play button to listen to article

భారత మాజీ ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అది కూడా రాజస్థాన్‌ (Rajastan) మాజీ శాసనసభ్యుడిగా. 1993 నుంచి 1998 వరకు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేగా కిషన్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మాజీ ఎమ్మెల్యేగా జూలై 2019 వరకు పెన్షన్ పొందారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) గవర్నర్‌(Governor)గా బాధ్యతలు చేపట్టాక దాన్ని ఆపేశారు.

ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్‌ఖడ్ తన పదవికి జూలై 21న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా తనకు పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ సెక్రటేరియట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయం ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఆయన రాజీనామాను ఆమోదించిన తేదీ నుంచి ఆయనకు పెన్షన్ వరిస్తుందని సెక్రటేరియట్‌ అధికారులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యేకు నెలకు రూ. 35వేల పెన్షన్ ఇస్తారు. వయసు పెరిగేకొద్ది పెన్షన్ కూడా పెరుగుతుంది. 70 ఏళ్లు పైబడిన వారికి 20 శాతం అదనంగా ఇస్తారు. ఆ లెక్కన ప్రస్తుతం 74 ఏళ్ల కావడంతో ధన్‌ఖడ్‌కు  రూ.42,000 పెన్షన్ వస్తుందని అధికారులు చెబుతున్నారు.

అయితే ధన్‌ఖడ్ మూడు పెన్షన్లకు అర్హులు.- మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ ఎంపీ, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేగా.

గతంలో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్‌కు ఎలాంటి పెన్షన్ ప్రయోజనాలు లేకున్నా.. రూ. 25వేల రీయింబర్స్‌మెంట్‌తో ఒక సెక్రటేరియల్ సిబ్బందిని నియమించుకునేందుకు అర్హులు.

ఒకసారి ఎంపీగా ఎన్నికైన ఆయనకు రూ.45వేల పెన్షన్, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. మాజీ ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ నెలకు దాదాపు రూ. 2 లక్షల పెన్షన్, టైప్-8 బంగ్లా, ఒక వ్యక్తిగత కార్యదర్శి, ఒక అదనపు వ్యక్తిగత కార్యదర్శి, ఒక వ్యక్తిగత సహాయకుడు, ఒక వైద్యుడు, ఒక నర్సింగ్ అధికారి, నలుగురు వ్యక్తిగత సహాయకులను పొందేందుకు అర్హులు. మాజీ ఉపాధ్యక్షుడు మరణానంతం అతని లేదా ఆమె జీవిత భాగస్వామి టైప్-7 ఇంటికి అర్హులు. 

Tags:    

Similar News