మేథా పాట్కర్ కు జైలు శిక్ష, ఢిల్లీ ఎల్జీ పై నిరాధార ఆరోపణల కేసు

హక్కుల పేరుతో ఢిల్లీ ఎల్జీ పై నిరాధార ఆరోపణలు చేసిన మేథా పాట్కర్ కు ఐదు నెలల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాను కోర్టు విధించింది. రెండు దశాబ్దాల క్రితం..

Update: 2024-07-01 12:25 GMT

మేథా పాట్కార్ పై ఢిల్లీ గవర్నర్ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం పెట్టిన పరువు నష్టం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఈ కేసులో మేథా పాట్కార్ కు ఇక్కడి కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జడ్జి రాఘవ్ శర్మ తన తీర్పు వెలువరించారు.

కోర్టు తన ముందున్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని రెండు దశాబ్దాలుగా కేసు కొనసాగిన నేపథ్యంలో పాట్కర్‌కు శిక్ష విధించింది. అయితే ఉత్తర్వుపై అప్పీలు చేసుకునేందుకు నెల రోజుల పాటు కోర్టు శిక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే తీర్పు పరిశీలించాలన్న పాట్కార్ ప్రార్థనను తిరస్కరించిన న్యాయమూర్తి, వాస్తవాలు, నష్టాలు, వయస్సు, ఆరోగ్యం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నా అని వివరించారు. ఈ కారణాల వల్లే నేను ఈ కేసులో గరిష్టంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నప్పటికీ తక్కువ స్థాయిలో శిక్ష విధించినట్లు వెల్లడించారు.
సక్సేనాను "పిరికివాడు"గా అభివర్ణిస్తూ, హవాలా లావాదేవీల్లో అతని ప్రమేయం ఉందని పాట్కర్ చేసిన ప్రకటనలు పరువు నష్టం కలిగించడమే కాకుండా అతనిపై ప్రతికూల అభిప్రాయాలను ప్రేరేపించేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. గుజరాత్ వనరులను విదేశీల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని సక్సేనాపై మేథా పాట్కార్ విమర్శించారు. దీనిపై ఆధారాలు సమర్పించడంలో విఫలం అయ్యారు. ఇది వ్యక్తి చిత్తశుద్ది, అతని ప్రజాసేవపై ప్రత్యక్ష దాడి అని కోర్టు భావించింది. శిక్షపై వాదనలు మే 30న పూర్తయ్యాయి, ఆ తర్వాత శిక్షల పరిమాణంపై తీర్పు జూన్ 7న రిజర్వ్ చేయబడింది.
తనకు, నర్మదా బచావో ఆందోళన్ (NBA)కి వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించినందుకు పాట్కర్ పై సక్సేనా 2000 లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.ఇది రెండు దశాబ్దాల నుంచి కోర్టులో నలుగుతోంది.
అహ్మదాబాద్‌కు చెందిన 'కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్' అనే ఎన్‌జీవోకు నాయకత్వం వహించిన సక్సేనా, 2001లో ఒక టీవీ ఛానెల్‌లో తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటన జారీ చేసినందుకు పాట్కర్‌పై రెండు కేసులు దాఖలు చేశారు.
Tags:    

Similar News