‘కూరగాయలు, నిత్యావసరాల కొరత లేదు..’
మార్కెట్లకు యథావిధిగా సరుకుల రవాణా.. ధరలు కూడా అదుపులోనే ఉంటాయన్నకేంద్రం ..;
By : The Federal
Update: 2025-05-09 13:54 GMT
దేశంలో కూరగాయలు(Vegitables), ఇతర నిత్యావసరాల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. మార్కెట్లకు సరుకులు యథావిధిగా చేరుకుంటాయని, నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. రవాణాలో ఆలస్యం లేకుండా, ధరలు కూడా అదుపులో ఉంచేందుకు ఆయా రాష్ట్రాల్లో అధికారులు తనిఖీలు కూడా చేస్తారని పేర్కొంది.
కేంద్ర-రాష్ట్ర సమన్వయం..
నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించనుంది. నిత్యావసరాల రవాణా, ధరలు, కొరతపై వారితో సమీక్షించనుంది. వారు చెప్పే విషయాల ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అనవసర భయాందోళనలకు దారితీసే తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.