బీజేేపీ సొంత కేటాయింపు తరువాత శాఖలను ఏరుకున్న మిత్రపక్షాలు?

గతంకంటే మోదీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో 60 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ అదే తరహా పాత పాలనను తిరిగి ప్రజలపై రుద్దడానికి పాత మంత్రులను కొనసాగిస్తున్నారని..

Update: 2024-06-11 06:41 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రమంత్రి వర్గంలో, శాఖల కేటాయింపులో తన మార్క్ ను చూపించారు. తన కేబినేట్ లోని 72 మంది మంత్రులకు గాను 30 మందికి క్యాబినేట్ ర్యాంకులతో కూడిన శాఖలను కేటాయించారు. ఎప్పుడు లేనిదీ తన కేబినేట్ ను జంబో గా ఏర్పాటు చేశారు.

'బిగ్ ఫోర్'పై విశ్వాసం
తన మునుపటి పాలనలో మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ లకు వరుసగా రక్షణ, హోం, ఆర్ధిక, విదేశీ వ్యవహరాల శాఖలను కేటాయించారు. వీరి ప్రతిభపై తనకు విశ్వాసం ఉందని మోదీ మరోసారి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయింది. బీజేపీకి గత దశాబ్దంలో మెజారిటీ సీట్లు సొంతంగా సాధించింది. ఇప్పుడు ప్రజలు దాని స్థానాలను తగ్గించారు. దీని బట్టి వీరి శాఖలను మార్చవచ్చు. కానీ అది జనాలకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని భావించిన అధినాయకత్వం బిగ్ ఫోర్ కు తిరిగి అదే శాఖలను కేటాయించింది.
సీట్లు తగ్గడానికి మునుపటి ప్రభుత్వం లో ఏ మంత్రి అయినా తప్పు చేశారా అనే మదింపుకు మోదీ అంగీకరించడం లేదు. వాటిలో ముఖ్యంగా ఆర్ధిక పతనం, రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష నాయకులపైకి ఉసిగొల్పడం వంటివి. అందుకే చాలా మంది సహచరులకు అవే శాఖలు కేటాయించారు. ప్రస్తుతం కనిపిస్తున్న మోదీ 3.0 లో పాత ఎన్డీఏ మొత్తం కనిపిస్తుంది. గత రెండు ప్రభుత్వాల ఏర్పాటులో కనిపించిన అధికార హ్యంగోవర్ మోదీకి కాస్త దిగినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్ సీఎం నితీష్ కుమార్ లు కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
వేచి చూసే ధోరణిలో..
మోదీ క్యాబినేట్ పై విపక్ష ఇండి కూటమి అలయెన్స్ కు చెందిన నాయకులు వెక్కిరింపులు, వెటకారాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఏరుకోగా మిగిలిన క్యాబినేట్ బెర్తులను జేడీ(యూ), టీడీపీ తో పాటు మిగిలిన మిత్రపక్షాలు పంచుకున్నాయని ఆరోపిస్తున్నారు. దాదాపు అన్ని కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ చేజిక్కించుకుందని, సహాయ మంత్రిత్వ శాఖలు మాత్రమే మిత్రపక్షాలకు పంచారని అంటున్నారు. ఒకరకంగా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
టిడిపికి చెందిన కె రాంమోహన్ నాయుడుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, జెడి(యు) రాజీవ్ రంజన్ సింగ్ 'లాలన్'కు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమతో పాటు పంచాయితీ రాజ్ లభించింది. హిందుస్థాన్ అవామ్ మోర్చా వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తన పార్టీ నుంచి పార్లమెంటులో ఏకైక ఎంపీగా ఉన్నప్పటికీ క్యాబినెట్ బెర్త్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేయవచ్చు, అయితే మోదీ క్యాబినెట్‌లోని అత్యంత వృద్ధ సభ్యుడు నిరాడంబరమైన మంత్రివర్గంతో సంతృప్తి చెందారా అనేది చూడాలి. ఆయనకు MSME పరిశ్రమలు కేటాయించారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఉక్కు- భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అలాగే మోదీ పరమ విధేయుడు ఎల్ జేపీ నేత చిరాగ్ పాస్వాన్ కు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ను కేటాయించారు.
జేడీ(యూ) కు చెందిన ఒక నాయకుడు ఫెడరల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమిని విచ్చిన్నం చేసే ఆలోచనలు మాని, వేచి చూసే ధోరణి అవలంబించాలని సూచించారు. మోదీ ఈ సారి మిత్రపక్షాలకు కనీస విలువ ఇస్తారని ఆశిస్తున్నారని, గత రెండు పర్యాయాలు వ్యవహరించినట్లు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఎన్డీఏ లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయుడు వంటి నాయకులు ఇక్కడ జరిగే తప్పులను ఎత్తి చూపడానికి సిద్ధంగా లేదనేది వాస్తవం.
దిద్దుబాట్లు చేయలేదు
బీజేపీ గత పాలన నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ సీట్లు 303 నుంచి 240 కి పడిపోయాయి. ఇందుకు ప్రభుత్వం రైతుల పట్ల కనబరిచిన ఉాదాసీనత, అగ్నివీర్ పథకం, రాజ్యంగ వ్యవస్థలను ఇష్టారీతిన ఉపయోగించుకోవడం, వ్యక్తిగత స్వేచ్చను హరించడం. అయినప్పటికి బీజేపీ తన సొంత కోట నుంచి మంత్రులను ఎన్నుకుని వారికి తిరిగి అధికారాలను పంపిణీ చేసింది.
ఎన్నికల్లో విపక్షాలు దీనిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. మోదీ అనుసరిస్తున్న గబిబిజి విదేశాంగ విధానం, లఢక్, అరుణాచల్ ప్రదేశ్ లోని భారత భూభాగాల్లో చైనా తిష్ట వేయడం, వాటిని మోదీ ప్రభుత్వం వెనక్కి పంపకపోవడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. గత పాలన వైఫల్యాలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకే తన మంత్రులను తిరిగి నియమించుకున్నారు.
వినాశకరమైన ఆర్థిక విధాన నిర్ణయాలకు అధ్యక్షత వహించి ధరల పెరుగుదల, నిరుద్యోగానికి కారణమైన నిర్మలా సీతారామన్ తిరిగి ఆర్ధికమంత్రిత్వ శాఖకు తిరిగి వచ్చారు.
అగ్నివీర్‌పై అలజడి, లడఖ్, అరుణాచల్‌లలోకి చైనా చొరబాట్లు, సాయుధ బలగాల ఉన్నత స్థాయి రాజకీయీకరణకు సంబంధించిన విషయాలు ఉన్నప్పటికీ, రాజ్‌నాథ్ మళ్లీ రక్షణకు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే రాజకీయ దౌత్యవేత్తగా మారిన ఎస్ జైశంకర్ మళ్లీ MEAకి నాయకత్వం వహిస్తున్నారు. అయితే అతని పర్యవేక్షణలో భారతదేశం పొరుగు దేశాలతో తరుచూ మాటల యుద్దానికి దిగింది.
మణిపూర్‌లో అత్యంత భయంకరమైన జాతి ప్రక్షాళన సంఘర్షణకు అధ్యక్షత వహించిన షా, జమ్మూ- కాశ్మీర్ ( లడఖ్) మొత్తం జనాభాను ఐదేళ్లపాటు రాజకీయంగా లొంగదీసుకున్నాడు. రాజకీయ ప్రత్యర్థులపై (మరియు కొంతమంది ప్రస్తుత మిత్రులపై) దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పాడు. అలా రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసిన షా తిరిగి హోంశాఖకే వచ్చారు.
ఘర్షనాత్మకమైన వైఖరి..
ఈ వక్రబుద్ధి మోదీ పాలనలో ఈ బిగ్ ఫోర్ వరకే పరిమితం కాలేదు. మునుపటి శాఖలకు నాయకత్వం వహిస్తున్న మంత్రులు తిరిగి అదే శాఖలకు వచ్చారు. వారు కూడా నిస్సందేహంగా అదే స్వభావాన్ని కొనసాగిస్తారు.
అశ్వనీ వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో భయంకరమైన బాలాసోర్ రైలు దుర్ఘటన జరిగింది. రైల్వే మౌలిక సదుపాయాలు, సేవల క్రమంగా నాసిరకంగా మారాయి. రైళ్లలో వచ్చే ఫుడ్ నాణ్యత మరీ తీసికట్టుగా తయారు కావడం, అనేక రైళ్ల రద్దు, కేవలం వందే భారత్ రైళ్లపైనే దృష్టి పెట్టడంతో సాధారణ ప్రజానీకం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పుడు అశ్వినీ వైష్ణవ్ కు అదనంగా కీలకమైన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలకు కూడా అప్పగించారు.


 


దశాబ్దం తరువాత ప్రతిపక్షానికి లోక్ సభ లో అత్యధిక సీట్లు వచ్చాయి. ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉంటే విపక్ష ఇండి కూటమికి 234 మంది సభ్యుల బలం ఉంది. అధికార పక్షానికి కంటే విపక్షానికి 60 మంది ఎంపీల బలం ఉన్నప్పటికీ మోదీ రాజీ పడకుండా, విపక్షం పై ఎదురుదాడి వ్యూహానికి ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి మంత్రివర్గ కూర్పే ఉదాహారణ.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరెన్ రిజిజును, డిప్యూటీగా అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను ఆయన ఎంచుకున్న విషయాన్ని ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందా? మోదీ 2.0 సమయంలో కొంతకాలం న్యాయ మంత్రిగా, రిజిజు అప్పటి కోర్టులపై విరుచుపడ్డారు. మరికొంత కాలానికి ఆయనకు ఇచ్చిన మరో మంత్రిత్వశాఖను కూడా మోదీ తొలగించారు. అయినప్పటికీ వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంది. వారు సాధారణంగా ప్రతిపక్షాలను నీచమైన వ్యాఖ్యలతో తిట్టేవారు.
పనితీరు సరిగా లేని వారికి రెండో అవకాశం
ఎన్నికల్లో అధికారపక్షం, విపక్షం హోరాహోరీగా పోరాడాయి. రెండు పక్షాలకు చాలా సన్నటి రేఖ మాత్రమే ఉంది. అయినప్పటికి బీజేపీ పాత ధోరణినే కొనసాగించింది. కిరణ్ రిజుజు వంటి వ్యక్తులు ఎవరికి ఆమోదయోగ్యం కారు. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవహరాలను చాలా చాకచక్యంగా నడిపించాలి. ఇది ఆయనకు సాధ్యపడే విషయం కాదు.
క్యాబినెట్ మంత్రులుగా కట్ చేసిన చాలా మంది ఇతర సీనియర్ నాయకులు కూడా తమకు అప్పగించిన పోర్ట్‌ఫోలియోలను బట్టి కొంత విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, అదే పోర్ట్‌ఫోలియోతో ఐదేళ్ల తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి తిరిగి వచ్చారు -( ఆరోగ్యం కుటుంబ సంక్షేమం )- ఇందులో అతను మొదటి మోదీ ప్రభుత్వంలో తన ముద్ర వేయలేకపోయాడు, అయితే పీయూష్ గోయల్ తిరిగి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు వచ్చారు.
అదేవిధంగా, భూపేంద్ర యాదవ్ గత ప్రభుత్వంలో నిర్వహించిన పర్యావరణ మంత్రిత్వ శాఖకు తిరిగి వచ్చారు. అదే సమయంలో భారీ మైనింగ్ - మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆమోదాలకు అధ్యక్షత వహిస్తాడు. గత ప్రభుత్వంలో పెట్రోలియం మంత్రిగా పెరిగిన ఇంధన ధరలపై వినియోగదారుల బాధలను తగ్గించడానికి ఏమీ చేయని హర్దీప్ పూరీ, మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్ కూడా మంత్రిత్వశాఖలోకి వచ్చారు.
సిల్వర్ లైనింగ్
కొనసాగింపు, ఘర్షణ, నిష్కపటత్వం, అహంకారం వంటి దురదృష్టకరమైన ఈ కథలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నితిన్ గడ్కరీ, మాజీ సీఎం, మామగా పిలవబడే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్. దశాబ్ధకాలంలో గడ్కరీ దేశ రోడ్లు నెట్వర్క్ ను భారీ లిప్టింగ్ చేశారు. ఆయనకు మరోసారి మోదీ ప్రభుత్వం ఇదే శాఖను అప్పగించింది. చౌహాన్ వ్యవసాయం - రైతుల సంక్షేమం, గ్రామీణ శాఖలకు కొత్త మంత్రిగా ఉంటారు.
ఎక్కువగా వ్యవసాయాధారమైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు ప్రశంసలు తెచ్చిపెట్టిన ప్రబలమైన వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడంలో చౌహాన్ కీలకపాత్ర పోషించారు. నిజానికి, మధ్యప్రదేశ్, చౌహాన్ సారథ్యంలోని UPA-II కాలంలో కేంద్రం కృషి కర్మన్ అవార్డును క్రమం తప్పకుండా స్వీకరించేది ఆయన ప్రభుత్వమే.
చౌహాన్ 2017 లో మందసౌర్ గోలీ కాండ్ ద్వారా కలుషితమైంది, ఆ సమయంలో పోలీసులు నిరసన తెలిపిన రైతులపై కాల్పులు జరిపారు, ఇందులో కనీసం ఐదుగురు రైతులను చనిపోయారు. అయితే ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆయన తిరిగి రైతుల మద్ధతును తిరిగి పొందారు.
ముఖ్యంగా హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతు సమాజంలో మోదీ, బిజెపి అత్యంత అప్రతిష్ట పాలైన తరుణంలో చౌహాన్ వ్యవసాయ మంత్రిగా నియమితులయ్యారు. మోదీ ప్రభుత్వం ఈ పనిలో కష్టాలున్నాయని పరోక్షంగా చౌహన్ నియామకంతో అంగీకరించినట్లు అయింది.
ప్రత్యేకించి MSPకి చట్టపరమైన మద్ధతును అందించాలని విపక్ష కూటమి ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికితోడు ముందు ముందు హర్యానా, మహరాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయనే విషయాన్ని దృష్టి పెట్టుకుని చౌహన్ కు వ్యవసాయ శాఖను అప్పగించారు.


Tags:    

Similar News