మమతకు లండన్‌లో నిరసన సెగ..

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని కెల్లాగ్ కాలేజీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన పశ్చిమ బెంగాల్ సీఎం;

Update: 2025-03-28 09:02 GMT
Click the Play button to listen to article

లండన్(London) పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ (West Bengal) సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)కి నిరసన సెగ తాకింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం (మార్చి 27) లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని కెల్లాగ్ కాలేజీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తుండగా.. వామపక్ష విద్యార్థులు నిరసన తెలిపారు. 2023లో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన హింస, మైనర్‌పై టీఎంసీ నాయకుడి కుమారుడు అత్యాచారం ఘటన గురించి రాసి ఉన్న ప్లకార్డును భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) యూకే యూనిట్‌కు చెందిన విద్యార్థులు ప్రదర్శించారు.

అయితే మమత వారికి గట్టిగానే సమాధానమిచ్చారు. ‘‘ఇక్కడ రాజకీయాలు చేసే బదులు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి మీ పార్టీని బలోపేతం చేసుకోండి. అప్పుడే వాళ్లు మాతో తలపడగలరు’’ అని అన్నారామె. ఆ మాటలతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. దీంతో ఆమె మరోసారి స్పందిచాల్సి వచ్చింది. 2019లో ఆధారాలు లేకపోవడంతో సీపీఐ(ఎం) యువజన విభాగం కార్యకర్త లాలూ ఆలం చేసిన దాడి తర్వాత గాయపడి, బ్యాండేజీలతో కప్పబడి ఉన్న తన 1990 ఫోటోను మమత ఎత్తి చూపారు.

ఆర్జీ కర్ అత్యాచార ఘటన గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నకు..‘‘ఇది ప్రజాస్వామ్యం. "దయచేసి కాస్త గట్టిగా మాట్లాడండి.’’ అంటూ.. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఎటువంటి పాత్ర లేదని చెప్పారు మమత.

బెంగాల్‌కు అవమానం: బీజేపీ

‘‘లండన్‌లో బెంగాలీ హిందూ సమాజం సభ్యులు మమతా బెనర్జీని నిలదీశారు. ఆర్జీ కర్‌లో లేడీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, సందేశ్‌ఖలిలో మహిళలపై నేరాలు, హిందువుల మారణహోమం గురించి ప్రశ్నించినపుడు ఆమె సమాధానమిచ్చారు. 

Tags:    

Similar News