గచ్చిబౌలిలో కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా

ఎఫ్ సిఐ లే అవుట్ లో అక్రమ కట్టడాల కూల్చివేత

Update: 2025-11-17 11:01 GMT
గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలను కూలుస్తున్న హైడ్రా

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు సోమవారం కూల్చివేశారు. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లేఅవుట్‌లో అక్రమంగా నిర్మాణాలు వెలిసాయి. లేఅవుట్‌లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రాకు సూచించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య అనుమతులు లేని నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేశారు.

ఎఫ్ సిఐ లే అవుట్ లో తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యాశ్రీధర్ రావు రోడ్లు వేసినట్లు స్థానికులు కోర్టు నాశ్రయించారు. సంధ్యా శ్రీధర్ రావుపై అగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు హైడ్రా పని తీరును మెచ్చుకుంది. ఎఫ్ సిఐ బాధితులకు అండగా నిలవాలని సూచించించింది. కోట్ల విలువైన స్థలాన్ని హైడ్రా కాపాడటం పట్ల స్థానికులు హర్షం వెలిబుచ్చారు.

Tags:    

Similar News