సౌదీ అరేబియా మృతులకు రూ.5లక్షల నష్టపరిహారం
కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.
By : The Federal
Update: 2025-11-17 10:54 GMT
మక్కాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది మరణించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. సోమవారం నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బాధితునికి రూ.5 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించింది. చనిపోయినవారి మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధితకుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.