ఢిల్లీలో తగ్గిన గాలి నాణ్యత - PUC ఉల్లంఘనలపై కఠిన చర్యలు..
బీఎస్-III వాహనాలకు నో ఎంట్రీ..
ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం(Air Pollution) పెరిగింది. దీంతో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లోయర్ గ్రేడ్ వాహనాల ప్రవేశాన్ని నిరోధించేందుకు సరిహద్దు పాయింట్ల వద్ద ప్రత్యేక బృందాలను ఉంటారు. కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్‌తో పాటు వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహన యజమానులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గాలి నాణ్యత తగ్గుదలకు వాహనాల నుంచి విడుదలయ్యే పొగ కూడా కారణమని తెలిపిన ఓ నివేదిక ఆధారంగా రేఖా గుప్తా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
2024 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు 4.87 లక్షల మంది వాహనదారులకు పీయూసీ జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం తెలిపింది. పీయూసీ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుడికి మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ. 10వేలు జరిమానా విధిస్తున్నారు. సిమెంట్, ఇసుకను బహిరంగ ప్రదేశాల్లో తీసుకెళ్లే 941 వాహనాలకు గుర్తించి జరిమానా విధించారు.
ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉన్న డేటా ప్రకారం.. పశ్చిమ ట్రాఫిక్ రేంజ్‌లో అత్యధిక పీయూసీ ఉల్లంఘనలు (1,14,754 చలాన్లు) నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పు (1,09,707), దక్షిణ (1,06,939), ఉత్తర (96,984), వాయువ్య (83,438) సెంట్రల్ ఢిల్లీలో (76,012) నమోదు అయ్యాయి. జరిమానాలు విధించినా.. కేవలం 10 శాతం మంది మాత్రమే జరిమానా చెల్లించారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
బీఎస్-III వాహనాలకు నో ఎంట్రీ..
"రోడ్డు పక్కన నిఘా, ఆటోమేటెడ్ తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీ వెలుపలి నుంచి BS-III లేదా లోయర్-గ్రేడ్ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖతో కలిసి 23 బృందాలను సరిహద్దు పాయింట్ల వద్ద ఉంచారు.