సీఈసీ నియామకాన్ని తప్పబట్టిన రాహుల్ గాంధీ

‘‘ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నపుడు కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది’’ - లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ;

Update: 2025-02-18 11:27 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్ (Congress) నేత, లోక్‌సభా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం (ఫిబ్రవరి 18) ప్రధానమంత్రి, హోం మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టులో కేసు ఉన్న సమయంలో సభ్యత్వ కమిటీ సీఈసీని ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్‌(Gyanesh Kumar)ను కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (CEC) సోమవారం అర్థరాత్రి నియమించింది. ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరుగుతున్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని రాహుల్‌ గతంలో కోరారు.

‘సీఈసీ నియామకం అనైతికం’

“ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో నేను ప్రధాని, హోం మంత్రికి నోట్‌ రాశా. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి.. CEC, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలని ఉంది. అయితే కేంద్రం ఆ ఆదేశాన్ని పట్టించుకోకుండా అదే ఏడాది ఆగస్టులో కొత్త చట్టం ద్వారా ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించింది. సీఈసీ ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కమిటీ నుంచి తొలగించిన CJI స్థానంలో ప్రధాని ఎంపిక చేసిన ఒక కేంద్ర మంత్రిని చేర్చారు. ఈ చర్య సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించడమే. మోదీ ప్రభుత్వం కోట్లాది మంది ఓటర్ల నమ్మకాన్ని మరింత దెబ్బతీసింది. ప్రతిపక్ష నేతగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను కాపాడటం నా బాధ్యత. కొత్త CEC నియామకం పూర్తిగా అనైతికం,” అని ఎక్స్‌లో రాహుల్ పోస్టు చేశారు.

రేపు విచారణ..

ఈ అంశం అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి సుప్రీంకోర్టు బుధవారం (ఫిబ్రవరి 19) CEC, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించనున్నట్లు తెలిపింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్. కోటిశ్వరసింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు

సీఈసీ నియామక ప్రక్రియపై ఎన్జీవో తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పూర్తిగా గౌరవించలేదని, ఇది ప్రజాస్వామ్య విలువలను తక్కువచేసే చర్యగా ఆయన అభివర్ణించారు. 

Tags:    

Similar News