సిట్ నివేదిక వచ్చాక మంత్రిపై చర్యలు: సీఎం సిద్ధరామయ్య

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? బీజేపీ డిమాండ్ చేస్తున్నదేమిటి?

Update: 2024-06-03 13:07 GMT

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి బి నాగేంద్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తెలిపారు.

నాగేంద్రను ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ పట్టుబట్టిన విషయం తెలిసిందే.

నాగేంద్ర నుండి వివరణ కోరారా అని అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య ఇలా సమాధానమిచ్చారు. "నేను (నాగేంద్ర) రాజీనామా కోరలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఇంకా రాలేదు. రెండు రోజుల క్రితమే సిట్‌ విచారణకు ఆదేశించాం. నివేదికలో ఏమి ఇస్తారో చూద్దాం" అని ముఖ్యమంత్రి అన్నారు.

జూన్ 6లోగా నాగేంద్రను మంత్రివర్గం నుంచి తప్పించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని బీజేపీ హెచ్చరించింది. దీనిపై సీఎం ఇలా స్పందించారు. "మాకు అల్టిమేటం ఇవ్వడానికి వారు ఎవరు? ప్రతిపక్ష పార్టీ అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలి. కానీ వారు (బిజెపి) వారు అలా చేయరు. అబద్ధాలు మాట్లాడుతూ నిరసన తెలుపుతారు" అని సిద్ధరామయ్య అన్నారు.

అసలు ఏం జరిగింది?

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ (KMSDSC) సూపరింటెండెంట్ పి చంద్రశేఖర్ (48) మే 28న తన స్వస్థలం శివమొగ్గలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి డెత్‌నోట్‌ ఆధారంగా ముగ్గురు సహోద్యోగులను సస్పెండ్ చేశారు. అదే నోట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సుసైడ్ ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

అసలు సూసైడ్ నోట్‌లో ఏముంది?

కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.187 కోట్ల నుంచి రూ.80 నుంచి 85 కోట్లు దారి మళ్లిన విషయాన్ని చంద్రశేఖర్ తన ఆరు పేజీల సూసైడ్ నోట్‌లో వివరించారు. మంత్రి కార్యాలయం, ఎండీ పద్మనాభం, అకౌంట్స్ మేనేజర్ పరశురాం దుర్గన్న సహా కీలక అధికారుల పాత్రను అందులో రాశారు. అవినీతి అధికారులపై చర్య తీసుకోవాలని నోట్‌లో చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

‘వెంటనే బర్తరఫ్ చేయాలి’

మంత్రి నాగేంద్రను జూన్ 6 లోపు బర్తరఫ్ చేయకపోతే రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని భారతీయ జనతా పార్టీ హెచ్చరించింది. నాగేంద్రను వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. ఘటనపై కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని ఆయన కోరుతున్నారు.

Tags:    

Similar News