చెన్నై డ్రగ్స్ కేసులో నటుడు కృష్ణ, డీలర్ కెవిన్ అరెస్టు..

నిందితుల ఇళ్లలో సోదాలు.. డ్రగ్స్ నెట్‌వర్స్‌పై లోతుగా దర్యాప్తు..;

Update: 2025-06-26 13:55 GMT
Click the Play button to listen to article

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం కేసులో గ్రేటర్ చెన్నై పోలీసులు గురువారం (జూన్ 26) మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నటుడు కృష్ణ, మాదకద్రవ్యాల వ్యాపారి జెస్వీర్ అలియాస్ కెవిన్‌ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ తీసుకున్నాడన్న ఆరోపణలతో తమిళ నటుడు శ్రీరామ్‌(Actor Sriram)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రదీప్ కుమార్, మాజీ AIADMK కార్యకర్త ప్రసాద్ నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసులు కృష్ణకోసం గాలించారు. కేరళలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు నాలుగు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేసి పట్టుకున్నారు. కృష్ణను ఒక రహస్య ప్రదేశంలో 18 గంటల పాటు విచారించినట్లు సమాచారం. కెవిన్, కృష్ణ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

నిందితుల ఇళ్లల్లో సోదాలు..

కెవిన్ ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులు 0.5 గ్రాముల కొకైన్, 10.3 గ్రాముల మెథాంఫెటమైన్, 2.75 గ్రాముల MDMA, 2.4 గ్రాముల OG గంజాయి, 30 గ్రాముల గంజాయి, 40 గ్రాముల OC పేపర్, 40 గ్రాముల జిప్‌లాక్ కవర్లు, రెండు చిన్న తూకం యంత్రాలు, ఒక ల్యాప్‌టాప్, ఒక మొబైల్ ఫోన్ మరియు రూ. 45,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. బెసెంట్ నగర్‌లో ఉంటున్న కృష్ణ నివాసంలో రెండు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ప్రసాద్‌తో కృష్ణకు ఉన్న ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News