‘కాంగ్రెస్‌తో పొత్తు కేవలం ఊహాగానాలే..’

స్పష్టం చేసిన తమిళగ వెట్రీ కజగం ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజ్..

Update: 2025-11-22 11:01 GMT
Click the Play button to listen to article

తమిళనాడు (Tamil Nadu) కరూర్‌(Karur)లో TVK చీఫ్ విజయ్ ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(stampede)లో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ దుర్ఘటన తర్వాత విజయ్ ఎక్కడా ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. కరూర్‌ ఘటన తర్వాత పార్టీ వైఖరిలో మార్పులేమైనా వచ్చాయా అని తెలుసుకునేందుకు TVK ప్రధాన కార్యదర్శి కెజి అరుణ్‌రాజ్‌ను ది ఫెడరల్ కలిసింది. ఆయన చాలా విషయాలు పంచుకున్నారు.

Full View

ప్రశ్న: కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయి దాదాపు రెండు నెలలు అయింది. ఆ ఘటన తర్వాత టీవీకేలో నిర్మాణాత్మక మార్పులేవైనా వచ్చాయా?

జవాబు: ఇలాంటి ఘటనలపై ప్రతిస్పందించడానికి మేం ఒక పాలనా మండలిని ఏర్పాటు చేశాం. అన్ని వైపుల నుంచి ఇన్‌పుట్‌లను సేకరించడం, అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం చేస్తుంది. మా నాయకుడు పీపుల్-కనెక్ట్ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నారు.

ప్రశ్న: సీబీఐ దర్యాప్తు ప్రారంభించి నెల రోజులు దాటింది. అయితే ఈ దర్యాప్తు అంతా రాజకీయ ప్రేరేపితమని, కేంద్ర సంస్థ ద్వారా విజయ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని డీఎంకే ఆరోపిస్తోంది. దానిపై మీరు ఎలా స్పందిస్తారు?

జవాబు: టీవీకే ఎప్పుడూ సీబీఐ దర్యాప్తు కోరలేదు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో నిష్పాక్షిక, దర్యాప్తు జరగాలని మేం డిమాండ్ చేశాం. మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ ద్వారా సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తుపై నేను ఏమే మాట్లాడదలుచుకోలేదు. డీఎంకే భావిస్తున్నట్లు ఏమీ జరగడం లేదు. స్పష్టమైన నిబంధనలను కూడా చెప్పకుండా హడావిడిగా ఏక వ్యక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసింది డీఎంకే. అలాగే, మద్రాస్ హైకోర్టులోని ఒక సింగిల్ జడ్జి సిట్‌కు ఆదేశించింది. ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించింది టీవీకే కాదు, డీఎంకే అని స్పష్టంగా తెలుస్తుంది.

ప్రశ్న: విజయ్ వరుసగా ర్యాలీలు చేసేవారు. ఆయన ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకునేవి. కరూర్ తొక్కిసలాట తర్వాత అవన్నీ ఆగిపోయాయి. విజయ్ తిరిగి మా మధ్యకు వస్తారని ప్రజలు ఆశించవచ్చా?

జవాబు: తప్పకుండా. ఆ విషయంలో విజయ్‌ చాలా ధృడంగా ఉన్నారు. కరూర్ ఘటన తర్వాత జనంలోకి వెళ్లాలన్న విజయ్ దృఢ సంకల్పం రెట్టింపయ్యింది. ఇటీవల మహాబలిపురంలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో మీరు దాన్ని చూసి ఉంటారు. ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో ఆయన మాటల్లోనే తెలుస్తుంది.

ప్రశ్న: బీహార్ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ చతికిల పడిపోయింది. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ -టీవీకే మధ్య చర్చలు ముగిశాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవమేనా?

జవాబు: పొత్తు చర్చలు మీడియా ఊహాగానాలే. కాంగ్రెస్ లేదా AIADMK నుంచి విడిపోయిన గ్రూపులతో ఎలాంటి చర్చలు జరగలేదు. టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్ మాత్రమే. ఇదే విషయాన్ని కౌన్సిల్ సమావేశంలోనూ చెప్పాం.

ప్రశ్న: మీ పార్టీ S.I.R పై ఆందోళన వ్యక్తం చేసింది. S.I.Rకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. బీహార్‌లో ఎన్నికల ఫలితాలను దొంగిలించారని ఆరోపించారు. ఆయన ప్రకటనతో మీరు ఏకీభవిస్తారా?

జవాబు: రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో కీలక భాగస్వాములు. వాటితో తగిన సంప్రదింపులు జరపకుండానే SIR ప్రక్రియను హడావిడిగా నిర్వహించారు. అదే పెద్ద ప్రక్రియ. కాని ఈసీ తక్కువ సమయంలో పూర్తి చేయాలనుకుంటుంది. తమకు సరైన శిక్షణ ఇవ్వలేదని, కొంతమంది BLOలు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు.

ప్రశ్న: అన్నాడీఎంకే, బీజేపీ(BJP) పట్ల విజయ్ మెతక వైఖరితో ఉన్నారన్న అభిప్రాయం ఉంది. మీరేమంటారు?

జవాబు: బీజేపీని మా సైద్ధాంతిక ప్రత్యర్థి అని మేం స్పష్టంగా ప్రకటించాం. వ్యవస్థపై పోటీకి దృఢ సంకల్పం అవసరం. అది మేం చేస్తున్నాం.

ప్రశ్న: కరూర్ విషాదం తర్వాత మీ మొదటి ర్యాలీకి పోలీసుల అనుమతి కోరారు. వారు ఇవ్వలేదు. మీరేం చేయబోతున్నారు?

జవాబు: పోలీసుల నుంచి ఇప్పటివరకు మాకు రాతపూర్వకంగా సమాధానం రాలేదు. తిరువణ్ణామలై దీపం, బాబ్రీ మసీదు కూల్చివేత రోజు (డిసెంబర్ 6కి) కావడంతో పర్మిషన్ ఇచ్చి ఉండకపోవచ్చు. మరో తేదీని పోలీసులకు చెబుతాం.

Tags:    

Similar News