ఈ సారి విజయ్ పార్టీది ‘ఇండోర్ మీటింగ్’...

కరూర్ విషాదం తరువాత పార్టీ కేడర్ లో ఆత్మ విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్న దళపతి

Update: 2025-11-22 09:49 GMT
టీవీకే అధిపతి, నటుడు విజయ్

-మహాలింగం పొన్నుస్వామి


కరూర్ తొక్కిసలాట జరిగిన తరువాత చాలారోజులకు ‘తమిళగ వెట్రి కజగం’ అధినేత విజయ్ తన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అయితే ఇది క్లోజ్డ్ డోర్ లో కేవలం 2 వేల మంది ఎంపిక చేసిన కార్యకర్తలతో మాత్రమే జరగబోతోంది.

కాంచీపురంలోని ‘‘జెప్పీయర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’’ కేంద్రంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. టీవీకే ఆవిర్భావం తరువాత భారీ బహిరంగ ర్యాలీలు నిర్వహించినప్పటికీ, కరూర్ తరువాత పరిస్థితి భిన్నంగా మారింది.

జేప్పియార్ ఎందుకు?
ఇదోదే యాధృచ్చికంగా జరిగింది కాదు. జెప్పియార్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్, దివంగత విద్యావేత్త రాజకీయ జెప్పీయార్(అన్నాడీఎంకే సపోర్టర్, ఎంజీఆర్ సన్నిహితుడు) ఆయన అల్లుడు మేరీ విల్సన్ జూన్ 2025 లో అనేకమంది నాయకులతో కలిసి టీవీకే లో చేరాడు.
ఇప్పుడు విజయ్ జెప్పియార్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. వాస్తవానికి విజయ్ 2025 లో ఒక కుటుంబ వివాహ రిసెప్షన్ కు హజరయ్యాడు. ఈ సంస్థ గతంలో గ్రాండ్ గా ‘‘విజయ్ మెరిట్ స్కాలర్ షిప్ అవార్డ్ ఫంక్షన్’ ను నిర్వహించింది. ఇక్కడ విద్యార్థులకు రూ. 2 కోట్లకు పైగా స్కాలర్ షిప్ లు విజయ్ అందించారు. ఇది టీవీకే నిర్వహించే సమావేశాలకు సురక్షితమైన స్థలంగా భావిస్తున్నారు.
కరూర్ తొక్కిసలాట..
సెప్టెంబర్ 27న కరూర్ లో విజయ్ ర్యాలీలో ప్రమాదం జరిగి 41 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యం, విజయ్ రాకలో తీవ్ర ఆలస్యం, అనధికార రోడ్ షో లో పదివేల మంది వస్తారని అంచనా వేయగా 25 నుంచి 27 వేల మందికి పైగా వచ్చారు.
సరిగా ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ విషాదం తరువాత విజయ్ తన రాజకీయ యాత్రను దాదాపు రెండు నెలల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. టీవీకే పార్టీ ప్రతినిధులపై కూడా అనేక ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.
ప్రజా సమావేశాలకు..
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు తరువాత మద్రాస్ హైకోర్టు అక్టోబర్ లో తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ సమావేశాలు, ర్యాలీలకు పది రోజుల్లో ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్ఓపీ)ని రూపొందించాలని ఆదేశించింది. కరూర్ తొక్కిసలాటపై కోర్టు విచారణ వ్యక్తం చేసింది. ముసాయిదా ఎస్ఓపీని తయారు చేసి రాజకీయ పార్టీలతో ప్రభుత్వం పంచుకుంది.
ప్రమాదాలకు కారణంగా నిర్వాహాకులకు బాధ్యులు చేసే నిబంధనలపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని, అభ్యంతరాల కారణంగా ఈ ఆలస్యం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఓపీ ఖరారు అయ్యే వరకూ పెద్ద సమావేశాలకు అనుమతులు మంజూరు చేయడంలో జిల్లా యంత్రాంగాలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి.
సేలం ర్యాలీకి అనుమతి నిరాకరణ..
ఇటీవల సేలం జిల్లా యంత్రాంగం డిసెంబర్ 4న విజయ్ ర్యాలీకి టీవీకే దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించింది. ఈ అంశానికి తగినంత నోటీస్ లేదని పేర్కొంది. దరఖాస్తును నాలుగు వారాల ముందుగానే ఇవ్వాలని పేర్కొంది.
కార్తీక దీపం, బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం భద్రత కారణంగా పోలీసులు తగినంత పహరా అందించలేమని అంటున్నారు. సేలం కార్యక్రమాన్ని డిసెంబర్ మధ్య నిర్వహించుకోవాలని సూచించారు.
మెగా ర్యాలీల నుంచి క్లోజ్డ్ డోర్ సమావేశాలు..
పార్టీ ప్రారంభ దశను నిర్వహించిన బహిరంగ సమావేశాలను కచ్చితంగా తప్పించుకుంటూ కేడర్ నైతికతను తిరిగి తీసుకురావడం, సభ్యత్వ డ్రైవ్ లను నవీకరించడం, 2026 అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయడం లక్ష్యంగా క్లోజ్డ్ డోర్ సెషన్ల నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు కేవలం ఐదు నెలల మాత్రమే మిగిలి ఉండటంతో టీవీకే జనాన్ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
Tags:    

Similar News