YCP- Jagan | కార్యకర్తల కోసం ఫిబ్రవరిలో జగన్ భరోసా యాత్ర

జిల్లా కమిటీలు నెలాఖరుకు పూర్తి చేస్తాం. కార్యకర్తలకు భరోసా ఇస్తానని జగన్ ప్రకటించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-08 15:25 GMT
నెల్లూరు జిల్లా పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్. జగన్

స్వల్ప కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఇది తమకు లాభం కలిగిస్తుందని మాజీ సీఎం వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు. దీనిని అనుకూలంగా మలచుకోవటం పాటు కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

"జనవరి నెల కొరకు జిల్లా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తా. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా పర్యటనకు శ్రీకారం చుడతా. అందరూ సంసిద్ధంగా ఉండండి. నా మాటగా కార్యకర్తలకు చెప్పింది" అని వైయస్ జగన్ కార్యాచరణ ప్రకటించారు. టీడీపీ కూటమి పింఛన్లలో దారుణంగా కోత విధించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా 64 లక్షలకు పైగా పింఛన్లు ఇస్తే, మొదటి దశలో మూడు లక్షల మందికి పైగా కోత విధించిరు. మరో మూడు లక్షల మంది పింఛన్లు కూడా తొలగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి జిల్లా మండల కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు జెడ్పిటిసి, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు కౌన్సిలర్లతో వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
పార్టీ ప్రక్షాళన
1. రాష్ట్రంలో వైసీపీని మరింత బలంపీఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. జిల్లా కమిటీలు ఈ జనవరి నెలాఖరుకు పూర్తి చేయడానికి కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. అన్ని జిల్లాల కమిటీలను ప్రక్షాళన చేయడంతో పాటు పునరుత్తేజం కల్పించడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ప్రకటించారు.
2. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాల పర్యటన ప్రారంభిస్తానని వైఎస్. జగన్ ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులపాటు విడిది చేయడం ద్వారా పార్టీ జెండా మోసిన కార్యకర్తకు భరోసా ఇస్తానని చెప్పారు.
"వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు"బలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పట్టించుకోలేదని అసంతృప్తి ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆలస్యంగా అయినా గ్రహించినట్లు ఉందనే విషయం జగన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
3. గతంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేసాం. వారికి భరోసా కల్పించడానికి జిల్లాల్లో మకాం వేయడం ద్వారా వారందరిలో పునరుత్తేజం కల్పిస్తానని వైయస్ జగన్ పార్టీ నాయకుల సమావేశంలో ప్రకటించారు.
" పార్టీ కార్యకర్తలు. ప్రధానంగా కిందిస్థాయిలో జెండాలు మోసిన వారికి ఇచ్చే భరోసా ఈ దఫా ఆషామాషీగా ఉండదు" అని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. "తన మాటగా పార్టీ క్యాడర్కు సందేశం అందించండి" అని సమీక్షకు హాజరైన నెల్లూరు జిల్లా నాయకులకు ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు.
ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుంది
"టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అసంతృప్తి మూటగట్టుకుంది" అని వైయస్ జగన్ గుర్తు చేశారు. విద్యార్థులు, రైతులు, మహిళలకు అందించే ఆర్థిక సహకారం లేకుండా పోయిందన్నారు.
"వైసిపి అధికారంలో ఉండగా పెంచన్గా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేశాం" అని జగన్ గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉండి ఉంటే, అమ్మఒడి కూడా పడేదని ఆయన గుర్తు చేశారు. ఇది ఒకటే కాదు..
"విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలు ప్రధానమైనవి. వాటిని నిర్లక్ష్యం చేశారు" అని గుర్తు చేసిన వైసిపి అధ్యక్షుడు జగన్ చివరాఖరికి పరిపాలనలో కూడా టిడిపి కూటమి విఫలమైందని విమర్శించారు. పాలన స్థానంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని తన ఆరోపణలను పునరుత్థాటించారు.
ఫోన్ ఆయుధం కావాలి
సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా వినియోగించమని వైయస్ జగన్ పార్టీ నాయకులు, శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. పార్టీ వాయిస్ జనంలోకి తీసుకువెళ్లడం ఫోన్ ప్రధాన అస్త్రంగా ఉపయోగపడుతుందని విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలపై వైసిపి సోషల్ మీడియా వారియర్లను టిడిపి కోటను ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తుందని ఆరోపించారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిప్పుతూ వేదనకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి కార్యకర్తలు, వారి కుటుంబాల లో మానసిక ధైర్యం కల్పించడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు జగన్ వెల్లడించారు. క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు వేధింపులకు గురైన కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఆయన ప్రకటించారు.
Tags:    

Similar News