‘కమలం’ మనల్నీ పట్టించుకోవడం లేదు..

ఎన్నికల ముందు జేడీఎస్- బీజేపీ బంధంలో విభేదాలు ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమను కమల దళం కలుపుకుని పోవడం లేదని జేడీఎస్ నాయకులు..

Update: 2024-03-19 06:04 GMT

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. పొత్తులు, ఎత్తులు రాజకీయ పార్టీల మధ్య జోరుగా సాగుతున్నాయి. అలకలు, సీట్ల బేరాలు, మాపై పెద్దన్నల జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్రాంతీయ పార్టీల ఆరోపణలు ఇలా రోజుకో రీతిగా సాగుతున్నాయి ఎన్నికల వ్యవహరాలు.. ఇప్పుడు తాజాగా కర్నాటకలోనూ ఇదే తీరులో జేడీఎస్- బీజేపీ మధ్య అలకలు మొదలయ్యాయి. కర్నాటకలో బీజేపీ ప్రధాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది. వీటికి జేడీఎస్ కు చెందిన మాజీ ప్రధాని దేవగౌడకు గానీ, లేదా మాజీ సీఎం కుమారస్వామికిగానీ ఎటువంటి ఆహ్వనాలు అందడం లేదు. దీనితో ఆ పార్టీ అలకపాన్పు ఎక్కింది.

బెంగళూరులో సోమవారం జరిగిన ముఖ్యమైన పార్టీ సమావేశంలో కూటమిలో చీలికలు ప్రస్తావనకు వచ్చాయి. అనేక మంది సీనియర్ JD(S) నాయకులు BJP వ్యవహరిస్తున్న తీరుతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కూటమి నుంచి బయటకు రావాలని ప్రస్తావించినట్లు సమాచారం.
నిజానికి బీజేపీతో ఎన్నికల పొత్తు జేడీఎస్ శ్రేణులకు నచ్చట్లేదు. ముఖ్యంగా వొక్కలిగ కంచుకోట అయిన పాత మైసూరు ప్రాంతంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందని అక్కడి స్థానిక నేతలు పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, తమ నాయకత్వాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని జేడీఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
జేడీఎస్‌ను బీజేపీ గౌరవించడం లేదు.
ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. బీజేపీ కావాలనే జేడీఎస్ ను ఒక క్రమ పద్దతిలో దూరం చేస్తోందనే వ్యాఖ్యలు వినిపించాయి. పొత్తు నుంచి బయటకు రావాలనే వ్యాఖ్యలు వినిపించాయని ఓ మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఫెడరల్ తో చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఏకపక్షంగా నిర్ణయించుకున్న హెచ్‌డీ కుమారస్వామిపై జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. JD(S) లోక్ సభ నియోజకవర్గాలలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, పార్టీని సంప్రదించకుండా బీజేపీతో సీట్ల షేరింగ్ సహ అనేక విషయాలకు ఒప్పుకున్నారని పార్టీ సీనియర్ నేతలు మనస్సులో ఉన్న బాధను వెళ్లగక్కారని తెలుస్తోంది.
అలాగే జేడీఎస్ ను సంప్రదించకుండా బీజేపీ ఏకంగా 20 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం కూడా జేడీఎస్ సీనియర్లు అభ్యంతరం, ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇదీ పార్టీ భవితవ్యం పై పూర్తిగా నెగటివ్ ప్రభావాన్ని చూపుతుందని సీనియర్ల అభిప్రాయంగా ఉంది. కూటమిలో సమానభాగస్వామ్యం కల్పిస్తామని దేవేగౌడ, కుమారస్వామి చెప్పిన తరువాత సమావేశం ముగిసింది.
కలబురగి, శివమొగ్గలో జరిగిన భారీ ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయితే వీటిల్లో జేడీఎస్ నాయకులను బీజేపీ కనీసం ఆహ్వనించలేదు. "ఎన్నికలలో వారికి మా మద్దతు ఎందుకు ? కలబుర్గి, శివమొగ్గ ప్రాంతాలతో సహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలలో JD(S)కి ఓట్ల శాతం ఉంది. కానీ వారు JD(S) నుంచి ఎటువంటి మద్దతు కోరలేదు" అని ఓ జేడీఎస్ నాయకుడి వాదనగా ఉంది.
18 ఎంపీ సీట్లు గెలవచ్చు..
దాదాపు 18 లోక్‌సభ నియోజకవర్గాల్లో JD(S)కి 3/4 శాతం ఓట్లు ఉన్నాయని, వాటన్నింటిలో బీజేపీ విజయం సాధించవచ్చని మరో జేడీఎస్ నాయకుడు అభిప్రాయపడ్డారు. ‘‘ర్యాలీల్లో పాల్గొనేందుకు ప్రధాని కర్ణాటకకు వస్తున్నారు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం జేడీ(ఎస్‌)ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. కళ్యాణ కర్నాటక ప్రాంతంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మోదీ ర్యాలీకి ఎవరినీ సంప్రదించలేదు. శివమొగ్గ ర్యాలీకి దేవెగౌడ లేదా కుమారస్వామిని ఆహ్వానించి ఉండవచ్చు. కానీ వారు ఆ పని చేయలేదు’’ అని నేత చెప్పారు.
ఇప్పటి వరకు జేడీఎస్ కి మాండ్య, హాసన్ రెండు స్థానాలు మాత్రమే దక్కగా, కోలార్ లోక్‌సభ నియోజకవర్గంపై కూడా బీజేపీ కన్నేసింది. కేవలం రెండు సీట్లు రావాలంటే బీజేపీతో జేడీ(ఎస్) ఎందుకు పొత్తు పెట్టుకుంది?’’ అని ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న పలువురు నేతలు దేవెగౌడ, కుమారస్వామిలను ప్రశ్నించారు.‘‘మాకు ఐదు సీట్లు వస్తాయని గతంలో మీరు చెప్పారు కానీ ఇప్పుడు బీజేపీ మనకు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇచ్చేలా కనిపిస్తుంది?’’ అని ప్రశ్నించారు.
‘పొత్తు సూత్రాలకు’ బీజేపీ కట్టుబడి ఉండకపోతే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కూడా కొందరు నేతలు చర్చించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి, కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు జేడీఎస్-బీజేపీ కూటమి ఏర్పడిందని, దాదాపు 3-4 శాతం జేడీ(ఎస్) ఓట్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతాయని అన్నారు.
Tags:    

Similar News