90 సీట్లతో మళ్లీ అధికారంలో వస్తాం: మహేష్ కుమార్ గౌడ్
టిపిసిసి సమావేశంలో ధీమా;
తెలంగాణలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 90 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అగ్రవర్ణానికి చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బలహీన వర్గానికి చెందిన తనకు పిసిసి అధ్యక్ష పదవి , మరో దళిత బిడ్డకు స్పీకర్ పదవి, మరో నలుగురు దళితులకు క్యాబినెట్ లో చోటు దక్కిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొత్తగా నియమితులైన నేతలకు తమపార్టీ చక్కటి అవకాశాలిచ్చిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను కోరారు.
ఈ సమావేశంలో గ్రామస్థాయి అధ్యక్షులకు అఖిల భారత అధ్యక్షులు మల్లి ఖార్జున ఖర్గే దిశా నిర్దేశం చేస్తారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.