జూరాలకు పోటెత్తిన వరద

14 గేట్ల ఎత్తివేత;

Update: 2025-07-04 14:20 GMT

జూరాలకు వరద పోటెత్తింది. గద్వాల్ జిల్లాలోని జూరాలకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు  భారీగా వరద నీరు చేరుతుంది. జలాశయంలో 1.25 లక్షల క్యూసెక్కులు నీరు చేరడంతో 14 గేట్లు ఎత్తి క్రిందికి వదులుతున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి గేట్ల ద్వారా మరో లక్షా 31 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల పూర్తి నీటి స్థామర్ధ్యం 9, 657 టిఎంసీలు అయితే ప్రస్తుతం 8.184 టిఎంసిలకు చేరుకుంది. కర్ణాటక ఆల్మట్టి రిజర్వాయర్ లో లక్ష క్యూసెక్కుల నీరు చేరుతోంది. దిగువకు 99 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణ్ పూర్ జలాశయంలో 99 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.

Tags:    

Similar News