ఆప్ నేతలకు కవిత ముడుపులు ఇచ్చారు: ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన చార్జ్‌షీట్‌లో కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఉంచింది.

Update: 2024-06-03 12:46 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన చార్జ్‌షీట్‌లో కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఉంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై పలు అభియోగాలు మోపింది. రూ.1100 కోట్ల వ్యాపారం జరిగిందని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. కవిత, ప్రభుత్వ ఉద్యోగులకు వారి మధ్యవర్తుల ద్వారా ముడుపులు చెల్లించారని పేర్కొంది. అలాగే కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని ఈడీ పేర్కొంది.

ఆప్ తిరస్కరణ

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పదేపదే ED ఆరోపణలను ఖండించింది. ఈ కేసులో ఎక్కడా కూడా డబ్బును స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవన్నారు.

‘సాక్ష్యాలను ధ్వంసం చేశారు’

ఈ కేసులో తన పాత్రను, ప్రమేయాన్ని దాచిపెట్టేందుకు కవిత తన మొబైల్ ఫోన్‌లోని సాక్ష్యాలను, వస్తువులను తొలగించారని ED ఆరోపించింది. ‘‘ఆమె తన తొమ్మిది ఫోన్‌లను పరీక్ష కోసం ఇచ్చారు. కానీ వాటన్నింటిని ఫార్మాట్ చేశారు. వాటిలో డేటా లేవు. ఈ కేసులో కవిత సాక్షులను ప్రభావితం చేశారని కూడా ఈడీ ఆరోపించింది.

మరోవైపు మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.

Tags:    

Similar News