కులంతో కాంగ్రెస్, హిందూత్వంతో బీజేపీ.. కన్నడ రాజకీయాలే వేరు

కర్నాటకలో ఈ రోజు మొదటి దశ ఎన్నికలు.. జాతీయ స్థాయిలో అయితే రెండో దశ ఎన్నికలు. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Update: 2024-04-26 07:48 GMT

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా నిలిచిన విషయం ఏమిటంటే, రాజకీయాలు క్రమంగా మోదీ- సిద్ధరామయ్యల హామీల నుంచి టర్న్ తీసుకుని, కులం- హిందూత్వంపై తిరిగాయి. మొదట, బిజెపి విషయానికి వస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణపైనే ఎక్కువగా దృష్టి సారించింది, అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇవ్వబోయే హమీల గురించి ప్రచారం చేసింది. ఏదీ ఏమైనప్పటిక రెండు ప్రధాన ప్రత్యర్థులు తమ రాజకీయాలను హిందూత్వం- కులం కార్డుగా మార్చివేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వొక్కలిగ, బిల్లవ, ముస్లిం ఓట్లు
శుక్రవారం (ఏప్రిల్ 26) పోలింగ్ జరగనున్న 14 నియోజకవర్గాలలో ఎక్కువ భాగం కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి, వాటిలో 10 పాత మైసూరు ప్రాంతంలో, రెండు తీర ప్రాంతంలో ఒకటైన చిత్రదుర్గ మధ్య కర్ణాటకలో ఉంది. ఇందులో తొమ్మిది నియోజకవర్గాలు శక్తివంతమైన వొక్కలిగ సామాజికవర్గానికి పట్టున్న ప్రాంతాలుగా పేరొందాయి, అయితే ఉడిపి-చిక్‌మగళూరు, దక్షిణ కన్నడలో బిల్లవులు, బంట్ల ఆధిపత్యం కూడా ఉంది.
అయితే కురుబలు, ఇతర OBC వర్గాలతో సహా మరికొన్ని వర్గాలు కూడా ఈ నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయిస్తున్నాయి. కోలార్, చిత్రదుర్గ, చామరాజనగర్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు. ఇక్కడ వొక్కలిగలు, కురుబలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలా కాకుండా, 14 నియోజకవర్గాల్లో లింగాయత్‌ల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి వారు ఇక్కడ పెద్దగా ప్రభావితం చూపరు.
ఈ 14 నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరో ప్రధాన సామాజికవర్గం ముస్లింలు. ముస్లింలు గతంలో కాంగ్రెస్, JD(S)లకు ఓటు వేశారు, దీని వలన పాత మైసూరు ప్రాంతంలో గణనీయమైన పట్టు సాధించగలిగారు. అయితే జేడీ(ఎస్) కమలదళంతో చేతులు కలపడంతో ముస్లింలు ఈ సారి కాంగ్రెస్ వైపుకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఉలేమా ఎమ్రీత్ షరియత్, కర్ణాటక డివిజన్ లౌకిక ఆధారాలను కోల్పోయినందున ఈసారి జెడి (ఎస్)కి మద్దతు ఇవ్వవద్దని కమ్యూనిటీని కోరింది.
హిందుత్వ, కులాన్ని ముందుకు తీసుకొచ్చారు..
జాతీయ ఎన్నికలకు ముందు, బిజెపి - కాంగ్రెస్ హిందూత్వ, కులం చుట్టూ తిరిగే చక్కటి ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అమలు చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాజకీయ విశ్లేషకుడు సి రుద్రప్ప ప్రకారం, ఎన్నికల ప్రచారం ప్రారంభంలో మోడీ చరిష్మా, సిద్ధరామయ్య హామీలపై ప్రజలు,మీడియా దృష్టి కేంద్రీకరించాయి, అయితే కాలక్రమేణా, హిందుత్వ, కులానికి రాజకీయాలు మారాయి. "కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలను నరేంద్ర మోదీ వర్సెస్ సిద్ధరామయ్య ప్రభుత్వ హామీ పథకాలుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశాల ప్రభావాన్ని మనం తోసిపుచ్చలేము. అయితే, ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల గ్రౌండ్ లో హిందుత్వ, కుల కారకాలు పని చేస్తున్నాయి. " చెప్పారు.
బీజేపీ లవ్ జిహాద్, హూబ్బల్లీలో జరిగిన హత్య, రాజ్యసభ ఎన్నికల్లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు, రామేశ్వర కేఫె పేలుడు, ప్రస్తావిస్తూ ఓటర్లను చేరుకుంటోంది. ఇవన్నీ హిందూ ఓట్లను ఏకీకరణ చేసే అంశాలని అనుకుంటోంది.
కాంగ్రెస్ ఆర్థికంగా హిందువుల కంటే ముస్లింలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తూ ప్రధాని మోదీ ప్రసంగాలు బీజేపీ వైఖరిని ఈ అంశాన్ని నొక్కి చెబుతున్నాయి. హుబ్బళ్లీ లో యువతి హత్య వారి వ్యక్తిగత కక్షతో జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఓటింగ్ ప్రారంభమైనప్పటికీ, ఈ పోటీ కథనాలు కర్ణాటకలో రాజకీయ చర్చను రూపొందిస్తూనే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కులంపైనే కాంగ్రెస్ దృష్టి
ఇదిలా ఉండగా, వొక్కలిగ ఓట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో కుల ప్రణాళికను రూపొందించింది కాంగ్రెస్. సిఎం సిద్ధరామయ్య అహిందా (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులు) నాయకుడు అయినప్పటికీ, కెపిసిసి చీఫ్, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ (డికెఎస్) వొక్కలిగ నాయకుడిగా వెలుగొందుతున్నారు. వొక్కలిగలు ఆధిపత్య కులంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో DKS వొక్కలిగ నాయకత్వానికి నాయకుడిగా ఆమోదముద్ర వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెజారిటీ నాయకులు ఒకే వర్గానికి చెందిన వారు కావడంతో వొక్కలిగ పార్టీగా భావించిన జేడీ(ఎస్) ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌కు దోహదపడింది. వొక్కలిగ కులంపై జేడీ(ఎస్) పట్టు బలహీనపడుతున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జేడీ(ఎస్) కమల ధారణ
జేడీ(ఎస్) ఇంతకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, దేవెగౌడ నేతృత్వంలోని పార్టీ హిందుత్వ మార్గాన్ని అనుసరించలేదు. అయితే, ఈసారి జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడం, ప్రముఖంగా కాషాయం ధరించడం, హిందూత్వ అనుకూల ప్రకటనలు చేయడం ద్వారా జేడీ(ఎస్) 'హిందుత్వ' వైపు మొగ్గు చూపింది.
వొక్కలిగలు ఆధిపత్య కులాలుగా ఉన్న దాదాపు 9 లోక్‌సభ నియోజకవర్గాలలో మాజీ ప్రధాని దేవే గౌడ తరువాత వారి నాయకుడిగా డీకే శివకుమార్ అని చాటిచెప్పేందుకు కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. దీనిని పసిగట్టిన బీజేపీ- జేడీఎస్ 91 ఏళ్ల వయస్సులో ఉన్న దేవే గౌడను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, డీకేఎస్‌ల మధ్య వొక్కలిగ నాయకత్వంపై మాటల యుద్ధం కూడా జరిగింది.
బీజేపీ - హిందుత్వ బెల్ట్‌లో
అదే సమయంలో, దక్షిణ కన్నడ, ఉడిపి-చిక్‌మగళూరు (మల్నాడు ప్రాంతానికి అనుబంధంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక భాగం, అంటే చిక్కమగళూరు) తీరప్రాంత నియోజకవర్గాలు కర్ణాటకలో ప్రధాన హిందుత్వ బెల్ట్‌గా ఏర్పడి బిజెపికి అనుకూలంగా ఉన్నాయి.
అందువల్ల, బిజెపి హిందుత్వ సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కులకార్డును ప్రయోగించడం ద్వారా తన పునాదిని పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. రెండు నియోజకవర్గాల్లోనూ అత్యధిక జనాభా కలిగిన బిల్లవ సామాజికవర్గం ప్రధానంగా భాజపాకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ నాయకత్వ స్థాయిలో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. ఈ సమాజం మత ఘర్షణల్లో చాలా మంది యువకులను కోల్పోయింది. ఇతర అగ్ర కులాలు తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని కూడా వారు ఆందోళన చెందుతున్నారు.
బిల్లవలను ఆకర్షిస్తున్న కాంగ్రెస్
బీజేపీ పై బిల్లవులకు ఉన్ అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బిల్లవ నాయకుడిని రంగంలోకి దింపుతోంది. దీంతో బిల్లవ సామాజిక వర్గంలోని నాయకులు ఈ సారి పార్టీలకు అతీతంగా తమ నాయకులకు మద్ధతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. ఇది బిజెపిని ఆందోళనకు గురి చేసింది. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అనే అంశాన్ని మరోసారి బయటకు తీసి బిల్లవలను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోంది.
మంగళూరుకు చెందిన బజరంగ్ దళ్ నాయకుడు ప్రవీణ్ పూజారి ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, కాంగ్రెస్ కుల కథన వ్యూహం బిజెపిని ఈ ప్రాంతంలో మతపరమైన కథనాలను పెంచుకోవడం కంటే వారి కథనాన్ని కులం వైపు మళ్లిస్తే మంచిదని అన్నారు.
కర్నాటకలో నాయకత్వ సంక్షోభంలో చిక్కుకున్న బిజెపి, ప్రధానంగా పాత మైసూరు ప్రాంతం, తీర ప్రాంతంలోని వొక్కలిగ, బిల్లవ సామాజిక వర్గం లో కాంగ్రెస్ తమ పట్టు పెంచుకోవడంపై ఆందోళన చెందుతోంది.
దళిత అంశం
చామరాజనగర్, కోలార్, చిత్రదుర్గతో సహా మూడు ఎస్సీ (రిజర్వ్డ్) నియోజకవర్గాల్లో రెండు దళిత వర్గాలు ఉన్నాయి. వామపక్ష దళితులు (ప్రధానంగా అంటరానివారు), వీరు జనాభాలో 60 శాతం, వీరితో పాటు కుడి దళితులు.
కాంగ్రెస్ ఇంతకు ముందు దళితులకు ప్రాధాన్యత ఇచ్చింది. మల్లికార్జున ఖర్గే, డాక్టర్ జి పరమేశ్వర, హెచ్‌సి మహదేవప్ప మొదలైన వారి దళిత నాయకులలో మెజారిటీ కుడి దళిత వర్గాలకు చెందిన వారు. కేహెచ్ మునియప్ప వంటి కొద్దిమంది వామపక్ష దళితులకు మాత్రమే పార్టీలో కొంత ప్రాధాన్యం లభించింది. బిజెపి ఇంతకుముందు వామపక్ష దళిత నాయకులకు ప్రాధాన్యత ఇచ్చింది. మెజారిటీ వామపక్ష దళితులు ఎల్లప్పుడూ బిజెపికి ఓటు వేశారు. వామపక్ష దళిత నాయకుడు నారాయణ స్వామిని కేంద్ర మంత్రిని కూడా చేశారు.
ఇప్పుడు కోలార్‌, చిత్రదుర్గ నుంచి ఇద్దరు వామపక్ష దళితులను, చామరాజనగర్‌ నియోజకవర్గం నుంచి ఓ కుడి దళితుడిని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. కుల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించినందుకు ఇది బిజెపిని కలవరపెట్టింది.
రాజకీయ విశ్లేషకుడు రుద్రప్ప ప్రకారం.. ఈ మొదటి దశ ఎన్నికల్లో హిందుత్వ మోదీ నుంచి కులం వైపు రాజకీయాలు మారాల్సి వచ్చింది. ఈ వ్యూహంలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఓటింగ్ లో వీరి వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News