ధర్మస్థల కేసు: చిన్నయ్యకు పుర్రెను ఇచ్చిన అపార్ట్ మెంట్ గుర్తింపు

బెంగళూర్ లో ఓ ఇంట్లో కుట్రదారులు తనకు మానవ కపాలం ఇచ్చినట్లు చెప్పిన నిందితుడు;

Update: 2025-09-01 06:09 GMT

ధర్మస్థలలో అనేక మహిళలపై అత్యాచారాలు చేసి, ఖననం చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేసిన ఫిర్యాదుదారుడిని అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతడిని బెంగళూర్ కు తీసుకెళ్లి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. కుట్రను అమలు జరపడానికి చిన్నయ్యకు ఇచ్చిన పుర్రెను బెంగళూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో కొంతమంది వ్యక్తులు అతనికి ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 

దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి నుంచి శనివారం అతడిని బెంగళూర్ కు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల ప్రకారం.. బెంగళూర్ లో కేసుతో సంబంధం ఉన్న వివిధ ప్రదేశాలలో మహజర్ ప్రోసీడింగ్స్(స్పాట్ తనిఖీలు) నిర్వహించడానికి తప్పుడు ఆరోపణలు చేసిన సీఎన్ చిన్నయ్యను సిట్ తీసుకెళ్లింది.

ఈ ఆపరేషన్ సమయంలో సాక్షుల వాంగ్మూలాలు, సమయపాలన ధృవీకరణలో సహాయపడే అనేక పత్రాలు, డిజిటల్ రికార్డులతో పాటు ఇతర సామగ్రిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆస్తి సంబంధిత పత్రాలు, కమ్యూనికేషన్ రికార్డులను కూడా సిట్ పరిశీలించినట్లు సమాచారం.

పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. చిన్నయ్య దర్యాప్తుకు సహకరించాడు. కుట్ర జరిగిన సమావేశాలు, సమాచార మార్పిడులు జరిగిన ప్రదేశాలను ఆయన అధికారులకు చూపించాడు. ఈ వివరాలను దర్యాప్తు బృందం రికార్డు చేసిందని, ఇప్పటికే సిట్ వద్ద ఉన్న ఫొరెన్సిక్, సాంకేతిక ఆధారాలతో వీటిని క్రాస్ చెక్ చేసినట్లు వారు తెలిపారు.
బెంగళూర్ లోని వివిధ ప్రదేశాలలో ఈ స్పాట్ తనిఖీలు జరిగాయి. వాటిలో చిన్నయ్య బస చేసిన, అతనితో కుట్ర అమలు చేయించిన వ్యక్తులు మాట్లాడిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా సిట్ ఓ అపార్ట్ మెంట్ కు సైతం వెళ్లింది. అక్కడ చిన్నయ్య, ఇతర కీలక వ్యక్తుల మధ్య రహస్య సమావేశాలు జరిగినట్లు తెలిసింది.
గతంలో బెల్తాంగడిలోని సిట్ కు సమర్పించిన చిన్నయ్య అప్పగించిన పుర్రె, బెంగళూర్ లోని ఈ అపార్ట్ మెంట్ లోనే అతనికి నిందితులు ఇచ్చినట్లు సమాచారం. తనిఖీలు పూర్తయ్యాక చిన్నయ్యను తిరిగి ఆదివారం బెల్తాంగడికి తీసుకొచ్చారు.
విచారణ కోసం చిన్నయ్యను కస్టడీలోనే ఉంచాల్సి ఉంటుందని, ప్రస్తుతం లభించిన ఆధారాలతో ఇతర ప్రదేశాలలో సోదాలు నిర్వహించాల్సి రావచ్చని అధికారులు తెలిపారు. సిట్ వచ్చే వారం కోర్టు ముందు కేసు నివేదికను దాఖలు చేస్తుందని భావిస్తున్నారు.
తప్పుడు కథనాలు..
గత రెండు దశాబ్దాలలో ధర్మస్థలలో లైంగిక వేధింపులు, హత్యలకు గురైన వందలాది మహిళలను తాను స్వయంగా పూడ్చిపెట్టినట్లు చిన్నయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కాంగ్రెస్ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది.
నిందితుడు చెప్పిన 11 ప్రదేశాలలో తవ్వకాలు జరిపిన సిట్ అక్కడ ఎటువంటి అవశేషాలు లభించకపోవడంతో తప్పుడు ఆరోపణలు చేసినట్లు గుర్తించింది. ఇదే సందర్భంలో సుజాత్ భట్ అనే మరో మహిళ తన కూతురు 2003 లో ధర్మస్థలలో తప్పిపోయినట్లు ఓ ఫోటో విడుదల చేసి డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నం చేశారు.
అయితే విచారణలో అసలు ఆమెకు కూతురే పుట్టలేదని, మంగళూర్ లో సుజాత్ భట్ పేర్కొన్న పేరుతో ఎవరూ మెడిసిన్ చదవలేదని తెలిసింది. పోలీసులు ఆమెను కూడా విచారించగా తన వెనక వేరే శక్తులు ఉన్నాయని, తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని అభ్యర్థించింది. ప్రస్తుతం ఈ కుట్ర వెనక ఎవరున్నారనే దానిపై కాంగ్రెస్ సర్కార్ విచారణ చేస్తోంది.
Tags:    

Similar News