బీజేపీ- జేడీ(ఎస్) మధ్య ‘చన్నపట్నం’ చిచ్చు..?
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జోడి కట్టిన జేడీ(ఎస్)- బీజేపీ మధ్య ఉప ఎన్నికలు చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి.
By : Muralidhara Khajane
Update: 2024-10-18 07:42 GMT
కర్నాటకలో ఉప ఎన్నికలు భాగస్వామ్య పక్షాలైన బీజేపీ- జేడీ(ఎస్) మధ్య చిచ్చు రేపేలా కనిపిస్తోంది. నవంబర్ 13న కర్ణాటకలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-జేడీ(ఎస్) కూటమి కష్టాల్లో పడింది. కీలకమైన చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయడంపై రెండు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థి ఎంపికపై తన కూటమి భాగస్వామి భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో గట్టి పోటీని కొనసాగిస్తూనే ఉంది. అయితే బిజెపి ఎమ్మెల్సీ సిపి యోగేశ్వర్ నే చన్నపట్నం నుంచి బరిలోకి దింపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదిలావుండగా, చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన యోగేశ్వర్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, ఉప ఎన్నికలో తమ పార్టీ తనకు టిక్కెట్టు రాకుండా చేస్తే తన దారి తనదే అని హెచ్చరించారు. “బిజెపి నాకు టిక్కెట్ నిరాకరించినట్లయితే నేను నా దారి నేను చూసుకుంటాను. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన అక్టోబర్ 24న తుది నిర్ణయం తీసుకుంటాను' అని ఆయన వెల్లడించారు.
JD(S) కంచుకోట
2024 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చన్నపట్నం సీటును ఖాళీ చేసిన కేంద్ర మంత్రి, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి ప్రస్తుతం ఆ సీటును బీజేపీకి ఇవ్వడానికి అంగీకరించడం లేదు. ‘‘ మా మధ్య చన్నపట్నం సీటకు సంబంధించి ఎటువంటి ఒప్పంద లేదు’’ అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
చన్నపట్నం చాలా కాలంగా జేడీ(ఎస్) కంచుకోటగా ఉందని, ఆ నియోజకవర్గంలో జేడీ(ఎస్) వరుసగా రెండు విజయాలు నమోదు చేసిందని కుమారస్వామి ఇటీవల ప్రస్తావించారు. ఈ సీటును బీజేపీకి వదులుకోవడానికి పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు ఇష్టపడడం లేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర బిజెపి యూనిట్ కూడా చన్నపట్నను వదులుకోవడానికి అనుకూలంగా లేదు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే యోగేశ్వర్, ఎలాగైనా ఉపఎన్నికలలో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. జెడి(ఎస్) ఒత్తిడికి లొంగి, ముఖ్యంగా కుమారస్వామిని అభ్యర్థిగా నిలబెట్టడానికి బిజెపి నిరాకరిస్తే, రాజీపడే ధోరణిలో లేరని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారు..
ఈ క్లిష్ట తరుణంలో యోగేశ్వర్‌ను వ్యతిరేకించకూడదని బిజెపి రాష్ట్ర నాయకులు అనుకుంటున్నారు. చన్నపట్నంలోని స్థానిక బిజెపి నాయకులు యోగేశ్వర్ చుట్టూ చేరుతున్నారు. సంవత్సరం క్రితం కూడా వారు వ్యతిరేకించిన జెడి (ఎస్) కోసం పని చేసేందుకు సిద్ధంగా లేరు. ప్రత్యర్థి కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్‌పై యోగేశ్వర్ మాత్రమే పోరాడగలరని వారు నమ్ముతున్నారు.
JD(S)తో రాజీ పడటం పాత మైసూరు ప్రాంతంలోని వొక్కలిగ నడిబొడ్డున చొచ్చుకుపోవాలనే బిజెపి ప్రణాళికలను ఎదురుదెబ్బ అవుతుందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. జేడీ(ఎస్), కుమారస్వామి కూడా వొక్కలిగ బెల్ట్‌పై పట్టు కోల్పోవడం ఇష్టం లేదు. "మేము చన్నపట్నాన్ని బిజెపికి వదులుకుంటే, రామనగర నుంచి మైసూరు వరకు వొక్కలిగ బెల్ట్‌పై మాకు పట్టు కోల్పోతాము" అని జెడి (ఎస్) సీనియర్ నాయకుడు ఫెడరల్‌తో అన్నారు.
యోగేశ్వర్‌పై బీజేపీ ఒత్తిడి
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ బసవరాజ్ బొమ్మై అక్టోబర్ 16న విలేకరులతో మాట్లాడుతూ.. యోగేశ్వర్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేలా కుమారస్వామిని ఒప్పించేందుకు కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. హస్యాస్పదంగా, 2019లో, కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రారంభించిన ఆపరేషన్ కమల నుండి బసవరాజ్ బొమ్మై భారీగా లబ్ధి పొందారు.
బీజేపీ సీనియర్ నేతలు కుమారస్వామిని కలిశారని, యోగేశ్వర్‌ను చన్నపట్నం నుంచి పోటీకి దింపాల్సిన అవసరం ఉందని ఆయనను ఒప్పించారని బొమ్మై చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నేతలను సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి హామీ ఇచ్చారు. యోగేశ్వర్‌కు టికెట్ నిరాకరించడంతో యోగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఉపఎన్నికలో పార్టీ అవకాశాలపై ప్రభావం చూపుతుందని గ్రహించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్ కు విషయం తెలియజేశారు. చన్నపట్నంలో ఎన్డీఏ అభ్యర్థిగా యోగేశ్వర్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది.
యోగేశ్వర్ 1999లో ఇండిపెండెంట్‌గా కర్ణాటక అసెంబ్లీలో చన్నపట్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2008లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై విజయం సాధించారు.
ప్రతిష్టాత్మకమైన, కీలకమైన నియోజకవర్గం
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో చన్నపట్న మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమైనది. వొక్కలిగ సామాజికవర్గానికి చెందిన జెడి(ఎస్) అధినేత కుమారస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్‌లు ఒకరిపై ఒకరు పోటీ పడటంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ఫలితాలు నేరుగా కర్ణాటక రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి.
హెచ్‌డి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని చన్నపట్నంలో పోటీకి దింపడం ద్వారా రాజకీయాల్లో అగ్రగామిగా నిలవాలని ప్రయత్నిస్తుండగా, ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గంలో తన సోదరుడు, మాజీ ఎంపి డికె సురేష్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శివకుమార్ తహతహలాడుతున్నారు.
చన్నపట్నంలో తన సోదరుడు డికె సురేష్ అభ్యర్థిత్వాన్ని సులభతరం చేయడానికి డికె శివకుమార్ పిచ్‌ను క్లియర్ చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కుమారస్వామిని ఎదుర్కోవడానికి అంతకన్నా బలీయమైన అభ్యర్థి దొరకడం లేదు. ఈ ఏడాది ఆగస్టులో చన్నపట్న ఉపఎన్నికల్లో ‘కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎవరు పోటీ చేసినా పర్వాలేదు’ అని శివకుమార్ ‘తానే కాంగ్రెస్ అభ్యర్థి’ అని ప్రకటించే స్థాయికి వెళ్లారు.