ప్రజ్వల్ రేవణ్ణ జైలులో చేస్తున్న ఉద్యోగం ఏమిటి?
అడ్మినిస్టేటివ్ వర్క్‌కు ఆసక్తి చూపిన కర్ణాటక మాజీ ఎంపీకి..;
అత్యాచారం (Rape) కేసులో కర్ణాటక(Karnataka)లోని హసన్ నియోజకవర్గ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అక్కడ లైబ్రరి క్లర్క్‌గా బాధ్యతలు అప్పగించారు జైలు అధికారులు. సహా ఖైదీలకు చదువుకోడానికి పుస్తకాలు ఇవ్వడం, తిరిగి వాటిని తీసుకోవడం రేవణ్ణ చేస్తున్నారు. ఈ పని చేసినందుకుగాను ఆయనకు రోజుకు రూ. 522 అందుతుంది.
జైలు నిబంధనల ప్రకారమే..
"నిర్దేశిత పనులు పూర్తిచేసే ఖైదీలకు ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. రేవణ్ణ చేసే పనికి రోజుకు రూ. 522 పొందేందుకు అర్హుడు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదీలు ఏదో ఒక రకమైన పని చేయవలసి ఉంటుంది. వారి నైపుణ్యాలు, ఆసక్తిని బట్టి పనుల్లో పెడతాం." అని జైలు అధికారి ఆదివారం (సెప్టెంబర్ 7) వార్తా సంస్థ PTIకి చెప్పారు.
నెలలో 12 రోజుల పని..
తొలుత పాలనాపర పనులు చేసేందుకు రేవణ్ణ ఆసక్తి చూపారని..అయితే జైలు యంత్రాంగం అతన్ని లైబ్రరీలో నియమించాలని నిర్ణయించిందని తెలిసింది. రేవణ్ణ కోర్టు కార్యకలాపాలకు హాజరు కావడం, తన న్యాయవాదులను కలవడానికి సమయం కేటాయించే అవకాశం ఉండడంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఖైదీలు సాధారణంగా నెలలో కనీసం 12 రోజులు అంటే వారానికి మూడు రోజులు పని చేయాల్సి ఉంటుంది. రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) సీనియర్ నాయకుడు, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కుమారుడు. ప్రజ్వల్‌పై దాఖలైన అత్యాచారం కేసులో ఇటీవల ట్రయల్ కోర్టు ప్రజ్వల్‌కు జీవిత ఖైదు విధించింది.