నేను ఇక ముందు మాట్లాడను: డీకే శివకుమార్

ఆర్ఎస్ఎస్ గీతం, చాముండి కొండ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి;

Update: 2025-08-28 10:47 GMT
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

ఇక ముందు నుంచి తాను మాట్లాడబోవడం లేదని, మీడియాకు ఏదైన అంశంపై వ్యాఖ్యలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను సంప్రదించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

ఆయన ఈ మధ్య అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడటం, చాముండి కొండ హిందువులది కాదని చెప్పడం ద్వారా వివాదంలో ఇరుక్కున్నారు. ముఖ్యంగా చాముండేశ్వరి కొండ హిందువుల ప్రత్యేక ఆస్తి కాదని శివకుమార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది.

వడియార్ విమర్శలు..
మైసూర్ బీజేపీ ఎంపీ, మైసూర్ రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ దేవతపై చేసిన ప్రకటనను బాధపెట్టేదిగా వర్ణించారు.
‘‘ఇది చాలా బాధాకరమైన, హాస్యాస్పదమైన ప్రకటన. ప్రజలు గౌరీ, గణేశులను పూజిస్తున్న సమయంలో, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రకటన ఇవ్వడం బాధాకరం’’ అని వడియార్ అన్నారు. అయితే వడియార్ పై శివకుమార్ ఎదురుదాడి చేశాడు.
‘‘నేను కొన్ని వాస్తవాలు మాట్లాడినప్పుడూ ప్రజలు సహించరు. అది ప్రమోదా దేవీ(మైసూర్ రాజకుటుంబ సభ్యురాలు) యదువీర్ కృష్ణదత్త వడియార్ లేదా అసెంబ్లీ లోపల కావచ్చు’’ అని శివకుమార్ విలేకరులతో అన్నారు.
మాట్లాడకపోవడమే మంచిది..
‘‘నేను మాట్లాడే ప్రతిదానిలో తప్పు వెతకడమే ప్రజల ఏకైక పని. అది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు లేదా మరెవరైనా కావచ్చు. ఇదంతా జరుగుతోంది. మాట్లాడకపోవడమే మంచిది. ఇతర నాయకులు, పార్టీ ప్రతినిధులు ఉన్నారు. మీరు వారితో మాట్లాడటం మంచిది’’ అని ఆయన అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చేసిన ప్రకటనపై విలేకరులు డీకే శివకుమార్ ను సంప్రదించారు. ఆగష్టు 21న కర్ణాటక అసెంబ్లీలో శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడినందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని సంతోష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
దసరా ప్రారంభోత్సవంపై వివాదం..
ఈ సంవత్సరం దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి ముస్లిం సమాజానికి చెందిన కన్నడ సాహిత్యకారిణి బాను ముష్తాక్ ను చాముండి గుట్టపైకి ఆహ్వానించారు. ఆమె తన హర్ట్ లాంప్ పుస్తకానికి బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చాముండేశ్వరి దేవత మరో రూపమైన భువనేశ్వరీ దేవత పట్ల ముష్తాక్ కు గౌరవం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఆయన ఈ మధ్య ఆర్ఎస్ఎస్ గీతం పాడటంపై కొంతమంది పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. దానితో ఆయన పార్టీకి క్షమాపణలు చెప్పారు.
Tags:    

Similar News