వచ్చే నెలలో కర్ణాటక మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ

సూచనప్రాయంగా వెల్లడించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Update: 2025-10-26 06:19 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వచ్చే నెలలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.

శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హైకమాండ్ నాలుగు నెలల క్రితం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని తనకు చెప్పిందని అయితే రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న తరువాత ఈ కసరత్తు చేపడతామని తాను వారికి చెప్పినట్లు ముఖ్యమంత్రి అన్నారు.

‘‘ఆ మైలురాయిని చేరుకున్న తరువాత నేను వారితో చర్చలు జరిపి వారి మార్గదర్శనం ప్రకారం ముందుకు వెళ్తాను’’ అని సిద్ధరామయ్య చెప్పారు. నవంబర్ 16న న్యూఢిల్లీకి తన పర్యటన సందర్భంగా పార్టీ మాజీ నాయకుడు, సీనియర్ న్యాయవాదీ కపిల్ సిబల్ రచించిన పుస్తక ఆవిష్కరణ తరువాత జరుగుతుందని పేర్కొన్నారు.

‘‘ఈ పర్యటన సందర్భంగా నేను పార్టీ హైకమాండ్ ను కలుస్తాను. రాష్ట్ర పరిపాలన, కొనసాగుతున్న పరిణామాల గురించి వారికి వివరించడం మా విధి’’ అని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ శీతకాల సమావేశాలు డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందని సిద్ధరామయ్య అన్నారు.


Tags:    

Similar News