మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: కేంద్రంపై డీఎంకే ఆరోపణ

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తుసంస్థలు తమ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని డీఎంకే ఆరోపించింది. తమ ఫోన్లను స్టాలిన్ ట్యాప్ చేయిస్తున్నారని అన్నాడీఎంకే..

Update: 2024-04-17 10:32 GMT

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఫోన్ ట్యాపింగ్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ట్యాపింగ్ కేసులు నమోదయి పోలీసులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిశాక రాజకీయా నాయకులు నోటీసులు రావచ్చని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ద్రవిద వాదానికి పుట్టినిల్లు అయినా తమిళనాడులో అధికార, ప్రతిపక్షాలతో పాటు కేంద్రంపైనే ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాయి అక్కడి రాజకీయపార్టీలు.

డీఎంకే పార్టీ కి చెందిన లోక్ సభ అభ్యర్థులు, అగ్రనేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్ సంభాషణలను కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని సీబీఐ, ఈడీ, ఐటీ డిపార్ట్ మెంట్లు ట్యాప్ చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
తమిళనాడు పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతల ఫోన్‌లను ట్యాప్ చేస్తుందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల తర్వాత అదే తరహ ఆరోపణలతో డీఎంకే కూడా కేంద్రపైనా ఫిర్యాదు చేసింది.
"భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినే అంశాలు, ఉగ్రవాద దాడుల నిరోధం వంటి ప్రయోజనాల కోసం తప్ప మరే అంశంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీలులేదు. అయితే దీనికి కూడా ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మా అభ్యర్థులు, ఫ్రంట్‌లైన్ నాయకులు, వారి స్నేహితులు, సన్నిహితుల ఫోన్లను కేంద్ర ఏజెన్సీలు చట్టవిరుద్ధంగా వింటున్నాయని మేము అర్థం చేసుకున్నాము” అని డిఎంకె సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి ఈసీకి చేసిన ఫిర్యాదులో తెలిపారు.
చట్టవిరుద్ధ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న ఏజెన్సీలు'
ఫోన్‌లను ట్యాప్ చేయడానికి, ఎన్నికలలో అధికార పార్టీ ఇతరులపై ఆధిపత్యం సాధించడానికి ఏజెన్సీలు “చట్టవిరుద్ధమైన సాఫ్ట్‌వేర్” ను ఉపయోగిస్తున్నాయని భారతి ఆరోపించారు. “పెగాసస్ వంటి సాఫ్ట్‌వేర్‌లను ఈ ఏజెన్సీలు రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఉపయోగిస్తున్నాయనే వాస్తవాన్ని ఇంకా మేము మర్చిపోలేదు” అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపి దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఈసీని కోరారు.
Tags:    

Similar News