‘తాస్మాక్ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి’

తాస్మాక్ సిబ్బందిపై డీవీఏసీ కేసు నమోదు చేయడంతో రంగంలోకి ఈడీ..ప్రముఖుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలంటున్న PMK లీడర్ రామదాస్..;

Byline :  The Federal
Update: 2025-03-12 11:40 GMT
Click the Play button to listen to article

తమిళనాడులో ప్రైవేటు డిస్ట్రిల్లరీల ద్వారా భారీ మొత్తంలో నల్లధనం చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Tasmac) అధికారులపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) FIR నమోదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది. మణి ల్యాండరింగ్ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మార్చి 7 నుంచి చెన్నై CMDA టవర్లలోని తాస్మాక్ ప్రధాన కార్యాలయం సహా ఐదు ప్రైవేట్ డిస్టిలరీల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహింరాచారు. తనిఖీల్లో దొరికన పత్రాల ఆధారంగా రూ.వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.

"ప్రైవేట్ డిస్టిలరీలు నల్లధనం కేంద్రలుగా మారాయి. ఈ అక్రమ లావాదేవీల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది’’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి ఒకరు తెలిపారు. ఈ కుంభకోణంలో తాస్మాక్ అధికారులకు పాత్ర కొంతేనని, రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని ఈడీ అనుమానిస్తోంది. తాస్మాక్ ద్వారా ఏటా రూ.30వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా.. దీని నిర్వహణపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాస్మిక్ ఎక్సైజ్ శాఖ పరిధిలో పనిచేస్తుండగా ఆ శాఖకు వి. సెంథిల్ బాలాజీ మంత్రిగా ఉన్నారు.

రామదాస్ ఆరోపణలేంటి?

తాస్మాక్ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని PMK (పట్టాళి మక్కల్ కచ్చి) అధ్యక్షుడు రామదాస్ డిమాండ్ చేస్తున్నారు. ‘‘తాస్మాక్ రిటైల్ స్టోర్లలో మద్యం బాటిల్ ధరను రూ.10 నుంచి రూ.50 వరకు పెంచడం ద్వారా అదనంగా ఏటా రూ.3,650 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రతి మద్యం కేసుపై డిస్టిలరీల నుంచి రూ.50 లంచం వసూలు చేయడం ద్వారా ఏడాదికి అదనంగా రూ.500 కోట్లు సమకూరుతుంది. మద్యం అమ్మకాలపై 50% వరకు పన్ను ఎగవేత గురించి ఆర్థిక శాఖ మాజీ మంత్రి PTR పలనివేల్ రాజన్ 2022లో ప్రముఖ పత్రికతో ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా సీబీఐతో విచారణ చేయించాలి’’ అని రామదాస్ డిమాండ్ చేశారు.

వాటితో పోలిస్తే తాస్మిక్ కుంభకోణం వేరు..

తమిళనాడు మద్యం కుంభకోణం ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన కుంభకోణాల కంటే భిన్నమైనది. ఢిల్లీలో మద్యం కుంభకోణంలో విధానపర మార్పులు చేస్తే..ఛత్తీస్‌గఢ్‌లో సమాంతర అమ్మకాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. తమిళనాడులో మాత్రం ఓవర్‌బిల్లింగ్ చేసి అవినీతికి పాల్పడ్డారు. 

Tags:    

Similar News