వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి ప్రజ్వల్..
లైంగిక ఆరోపణలతో దేశం వీడిన కర్ణాటక జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్‌ను తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో అరెస్టు చేసిన ఆయనను వైద్య పరీక్షలను తరలించారు.
By : The Federal
Update: 2024-05-31 12:34 GMT
పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నజేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను బెంగుళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రజ్వల్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దేశం వీడి జర్మనీకి వెళ్లిపోయారు. సుమారు నెల రోజుల అక్కడే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనను వెంటనే అరెస్టు చేశారు.
ప్రజ్వల్, అతని తల్లి భవానీ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌పై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.