ప్రజ్వల్‌‌ను ఎక్కడ అరెస్టు చేస్తారు? కర్నాటక హోంమంత్రి ఏమన్నారు?

లైంగిక వేధింపుల ఆరోపణలతో దేశం వీడిన హసన్ ఎంపీ ఎప్పుడు బెంగళూరుకు తిరిగి వస్తున్నాడు? ఆయనను ఎక్కడ అరెస్టు చేస్తున్నారు? హోం మంత్రి ఏం చెప్పారు?

Update: 2024-05-29 10:25 GMT

పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు విమానాశ్రయానికి రాగానే అరెస్ట్ చేస్తామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు.

రెండు రోజుల క్రితం ప్రజ్వల్ విడుదల చేసిన వీడియోలో తాను బెంగళూరుకు తిరిగి వస్తున్నానని, విచారణను సహకరిస్తానని పేర్కొన్నారు.

హసన్ ఎంపీ ప్రజ్వల్ మ్యూనిచ్ నుండి బెంగళూరుకు మే 30న రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్‌ బుక్ చేసుకున్నట్లు అధికారిక సమాచారం.మే 31న బెంగళూరుకు చేరుకుంటారు.

ఎయిర్ పోర్టులోనే అరెస్టు..

"అతని (ప్రజ్వల్)పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. కేసు దర్యాపు చేస్తున్న సిట్ బృందం ఆయనను అరెస్టు చేస్తుంది.’’ అని హోం మంత్రి చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్టు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు.. ‘‘ఇప్పటికే ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయినందున తక్షణమే అరెస్టు చేయాల్సి ఉంటుంది." అని చెప్పారు.

జెడి(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ అశ్లీల వీడియోలు బయటకు రావడంతో దేశం వీడారు. పార్లమెంటు ఎన్నికల వేళ ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది.

Tags:    

Similar News