పుతియా తలైమురై, పీటీఐ కార్యాలయాలకు బాంబు బెదిరింపు
బాంబు డిటెక్టర్లు, స్నిఫర్ డాగ్‌తో కార్యాలయాల్లో తనిఖీలు..
చెన్నైలోని పుతియా తలైమురై(Puthiya Thalaimurai) టీవీ ఛానల్ కార్యాలయంలో బాంబు ఉందని (Bomb threat) శుక్రవారం (అక్టోబర్ 10) తమిళనాడు(Tamil Nadu) డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి (డీజీపీ) ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గిండి సమీపంలోని ఎక్కట్టుతంగల్‌లోని టీవీ ఛానల్ కార్యాలయానికి బాంబు డిటెక్టర్లు, స్నిఫర్ డాగ్‌తో చేరుకున్నారు. ఉద్యోగులందరినీ బయటకు పంపి, 90 నిమిషాల పాటు కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
పీటీఐ కార్యాలయానికి కూడా..
చెన్నైలోని పీటీఐ (PTI) కార్యాలయానికి కూడా శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. అయితే బెదిరింపు లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.