త్రివర్ణ పతాకాలతో బైక్ ర్యాలీకి నో చెప్పిన తమిళనాడు పోలీసులు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అయితే తమిళనాడు పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహణకు అనుమతి నిరాకరించారు.

Update: 2024-08-11 12:31 GMT

మరో నాలుగు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల మీద త్రివర్ణ జెండాలు రెపరెపలాడనున్నాయి. అక్కడక్కడా జాతీయ జెండాలతో యువకులు బైకు ర్యాలీలూ నిర్వహిస్తారు. ఆగస్టు 15న త్రివర్ణ పతాకాలతో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు తమిళనాడులో పోలీసులు ససేమిరా అంటున్నారు. అలా చేయడానికి ఒప్పుకోవడం లేదు. బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తప్పుబడుతున్నారు. అధికార డీఎంకేకు జాతీయ జెండాను ఇష్టపడడం లేదన్న విషయం అర్థమైపోయిందన్నారు.

కోయంబత్తూర్‌లో త్రివర్ణ పతాక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ కార్యాలయ సిబ్బంది పోలీసు అధికారులకు అర్జీ పెట్టుకున్నారని అన్నామలై తెలిపారు. పోలీసులు నిర్దేశించిన తేదీ, సమయానికే ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ కార్యకర్తలు చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని అన్నామలై పేర్కొన్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వమే త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించాలని, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తన పార్టీ యువజన విభాగానికి ఆ బాధ్యతను అప్పగించాల్సి ఉందని చెప్పారు.

Tags:    

Similar News