టాస్మాక్ కుంభకోణం: ఈడీ విచారణపై సుప్రీం స్టే..

అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో పాలక డీఎంకే ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే ఈడీ ఆధారాలు చూపితే మళ్లీ దర్యాప్తు మొదలవుతుందన్నారు లాయర్లు.;

Update: 2025-05-23 09:36 GMT
Click the Play button to listen to article

తమిళనాడు (Tamil Nadu) స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (Tasmac) మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై గురువారం సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ED తన పరిమితులను దాటిందని, సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ.. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తి ఎజి మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో DMK నేతృత్వంలోని ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించింది.

అయితే సీనియర్ న్యాయవాది కె.ఎం. విజయన్ మాట్లాడుతూ ఈ స్టే విధింపు తాత్కాలికమేననన్నారు. ఈడీ బలమైన ఆధారాలు చూపితే వేసవి సెలవుల తర్వాత మళ్లీ విచారణకు కోర్టు అనుమతించవచ్చని చెప్పారు.

డీఎంకే(DMK) వర్సెస్ బీజేపీ (BJP)..

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టాస్మాక్ 'కుంభకోణం' ప్రాధాన్యతను సంతరించుకుంది. డీఎంకే, బీజేపీ దాని మిత్రపక్షం ఎఐఎడిఎంకె మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టాస్మిక్ కుంభకోణంలో దాదాపు వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ తమిళనాడు నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే వీటిని డీఎంకే తిప్పికొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈడీని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శిస్తున్నారు. ఈడీని "బ్లాక్‌మెయిలింగ్ సంస్థ"గా అభివర్ణించిన డీఎంకే సీనియర్ నాయకుడు ఆర్ఎస్ భారతి.. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యకు సుప్రీం ఇచ్చిన స్టే చెంపపెట్టు అని పేర్కొన్నారు.

2014 నుంచి 2021 మధ్య అవినీతికి సంబంధించి మద్యం దుకాణాల నిర్వాహకులపై నమోదయిన 41 ఎఫ్‌ఐఆర్‌‌లపై రాష్ట్రం ఇప్పటికే చర్యలు తీసుకుందని, వీటిలో చాలా వరకు అన్నాడీఎంకే పాలనలో జరిగినవేనని అని గుర్తుచేశారు. కాగా టాస్మాక్ కుంభకోణంలో రూ. 40వేల కోట్ల విలువైన అవినీతి జరిగిందని ఈపీఎస్ ఆరోపించారు. ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) నేతృత్వంలోని ఎఐఎడిఎంకె(AIADMK) పార్టీ బీజేపీతో కలిసి డీఎంకేను విమర్శించడం మొదలుపెట్టింది. మొత్తం మీద ఈ కుంభకోణం పరిణామాలు 2026 ఎన్నికలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Tags:    

Similar News