మద్యం కుంభకోణంలో టాస్మాక్ ఉన్నతాధికారులకు సమన్లు ​​

7 రోజుల్లోగా హాజరు కావాలన్న ఈడీ;

Update: 2025-04-24 14:17 GMT
Click the Play button to listen to article

వెయ్యి కోట్ల మద్యం కుంభకోణానికి (Liquor scam) సంబంధించి తమిళనాడు(Tamil Nadu) రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (Tasmac) సీనియర్ అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా సమన్లు ​​జారీ చేసింది. వీరిలో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ విశాకన్ (IAS), జనరల్ మేనేజర్లు ఎస్ సంగీత, టి రామదురైమురుగన్ ఉన్నారు. కోర్టు కేసులు, వ్యక్తిగత కారణాలను చూపుతూ గతంలో సమన్లను దాటవేసిన అధికారులు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారణ కోసం ఏడు రోజుల్లోగా నుంగంబాక్కం కార్యాలయంలో హాజరు కావాలని ED ఆదేశించింది.

అవినీతి, లంచం, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ చెన్నైలోని ఎగ్మోర్‌లోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మార్చి 6 నుంచి 8 వరకు నిర్వహించింది. టెండర్ ప్రక్రియలో అవకతవకలు, పెంచిన మద్యం ధరలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలకు ఈడీ ఆధారాలు సేకరించింది. తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) టాస్మాక్ అధికారుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ED చర్యలు తీసుకుంది.

మద్రాస్ హైకోర్టు ఆదేశం..

టాస్మాక్ ప్రధాన కార్యాలయంపై ED దాడి చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ అధికారులు కోర్టులో పిటీషన్లు వేశారు. విచారించిన మద్రాస్ హైకోర్టు దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిదేనని పేర్కొంది. మధ్యం కుంభకోణానికి సంబంధించి అధికారులను ప్రశ్నించేందుకు ఇప్పటికే ED ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచేందుకు టాస్మాక్ ప్రధాన కార్యాలయం, ఇతర ప్రదేశాలపై దాడి చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News