నర్మెట్టలో కొత్తరాతి యుగం నాటి పనిముట్టు

క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలు ఉంటుందన్న పరిశోధకులు.;

Update: 2025-08-05 06:13 GMT

సిద్ధిపేట జిల్లా నంగునూరు  మండలంలోని నర్మెట్ట గ్రామ పాటిగడ్డ మీద కొత్త రాతి యుగం నాటి పనిముట్టు లభించిందని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాటిగడ్డ మీద పరిశీలిస్తున్నపుడు ఈ  పనిముట్టు లభించిందని ఆయన తెలిపారు. గుండ్రగా ఉండి మధ్యలో హోల్ ఉంటే దానిని కంకణ శిల అంటారని, కానీ ఈ పనిముట్టు ద్విబుజాకారంలో  ఉండి 7 సెంటీమీటర్ల ఎత్తు ,  4 సెంటీమీటర్ల వెడల్పుతో మధ్యలో హోల్ ఉన్నదని, ఇలానే ఉండి కింది వైపు నూరిన ఆనవాళ్లు ఉంటే  అది రాతి గొడ్డలి పిలుస్తారు. ఆ హోల్ మధ్యలో కట్టెను అమర్చి  గొడ్డలిగా పూరమనవుడు వాడుకొనేవాడు, కాని దీనికి అలాంటిది ఏం లేకపోవడం వల్ల దీనిని ఆ కాలంలో బరువు  వేయడానికె ఉపయోగించారని చెప్పవచ్చు అన్నారు. దీని వయసు  క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News