ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్స్ పేరిట మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్టు ఈ అనుమానం;

Update: 2025-08-06 06:47 GMT

బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఆయన స్టే‌ట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్‌రాజ్‌ను గతవారం విచారించిన విషయం తెలిసిందే. మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని ఈడీ అధికారులకు ప్రకాష్ రాజ్ తేల్చిచెప్పారు. మరోవైపు టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానాకు కూడా ఆగస్టు 11వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే మరికొందరు నటులకు ఈటీ నోటీసులు పంపింది. వీరిలో మంచు లక్ష్మీప్రసన్న కూడా ఉన్నారు.ఆమె ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ అనుమానం. ఈ అంశంపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న మొత్తంపై లోతుగా ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్‌లకు టాలివుడ్ నటులు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది..? అనే కోణంలో ఈడీ అధికారులు ఆయనను విచారించారు.

Tags:    

Similar News