‘పుష్ప’ ఘటనపై మానవహక్కుల కమిషన్ సీరియస్

బాధిత మహిళ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియాకు ఆదేశం;

Update: 2025-08-06 15:03 GMT

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. పుష్ప 2 ప్రివ్యూ సినిమాకు వచ్చి చనిపోయిన మహిళ వివాదాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా పరిగణించింది. బుధవారం మానవ హక్కుల కమిషన్‌ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఘటనకు సంబంధించి ప్రభుత్వచీఫ్ సెక్రెటరీకి నోటీసులు జారి చేసింది.

పుష్ప ఘటనలో చనిపోయిన బాధిత మహిళకు ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే.. తొక్కిసలాట ఘటనలో పోలీస్‌ల పని తీరుపై కూడా నివేదిక సమర్పించాలని చీఫ్ సెక్రెటరీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

తొక్కిసలాట ఇలా జరిగింది

గత సంవత్సరం డిసెంబర్ లో సంధ్యా థియేటర్ లో పుష్ప సినిమా రిలీజయ్యింది.ఈ సినిమా ప్రివ్యూ షో చూడటానికి అల్లు అర్జున్ అభిమాని భాస్కర్ కుటుంబం సంధ్య థియేటర్ కు చేరుకుంది. భార్య రేవతి, కొడుకు తో లోపలికి వస్తున్న సమయంలో అల్లు అర్జున్ కూడా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చారు. అభిమానులు కూడా అల్లు అర్జున్ ను చూడటానికి కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి స్పృహకోల్పోయి అక్కడే చనిపోయింది. కొడుకు శ్రీతేజ్ ను తొక్కేయడంతో ఆక్సిజన్ అందక స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడ శ్రీతేజ్ కోమాలో వెళ్లిపోయారు. కోమానుంచి తేరుకున్న శ్రీతేజ్ ను ఇటీవలె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరుకున్న శ్రీతేజ్ ఇంతవరకు కోలుకోలేదు. 

Tags:    

Similar News