‘సృష్టి’ కేసులో మనీలాండరింగ్ కోణం

వివరాలు ఇవ్వాలని గోపాలపురం పోలీసులకు ఈడీ లేఖ;

Update: 2025-08-10 11:47 GMT

సృష్టి ఫెర్టిలిటీ కేసు (Srushti FertilityCase) లో మరో పురోగతి సాధించింది. సంతాన భాగ్యం కోసం సృష్టిని ఆశ్రయించిన దంపతులనుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ(ED) గుర్తించింది. డాక్టర్ నమ్రత సరోగసీ పేరిట ట్రీట్మెంట్ ఇస్తానని బుకాయిస్తూ దేశవ్యాప్తంగా నెట్ వర్క్ నడిపింది.డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు, పోలీసు అధికారులు, వైద్యాధికారులు ఆమె నెట్ వర్క్ లో ఉండేవారు. వీరిని డ్డం పెట్టుకునే డాక్టర్ నమ్రత కోట్లాది రూపాయల స్కాంకు పాల్పడిట్లు పోలీసులు తెలిపారు.విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అనుమానిస్తోంది.

మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో కేసు వివరాలు తమకు అందించాలని హైదరాబాద్‌ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు (ఈడీ) అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్లాది రూపాయలు పోగు చేసినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్ లో ఇప్పటివరకు 30 మంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సృష్టి ఫెర్టిలిటీ బ్యాంకు అకౌంట్లతో బాటు ఆమె వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లను కూడా గోపాలపురం పోలీసులు సీజ్ చేశారు.
25 నుంచి 30 కోట్ల రూపాయలు ఈ బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు వార్తలు రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 80 మంది శిశువులను సరోగసీ పేరిట దంపతులకు విక్రయించినట్టు, ఐవిఎఫ్ కోసం వచ్చిన దంపతులకు సరోగసీకి రెఫర్ చేసేదాన్ని అని డాక్టర్ నమ్రత  పోలీసుల కస్టడీలో ఒప్పుకున్నారు.
2020లో డాక్టర్ నమ్రతపై విశాఖలో కేసు నమోదైంది. హైదరాబాద్ లో కూడా ఆమె పై కేసులు నమోదయ్యాయి. అయినా నమ్రత అటు పోలీసులను, ఇటు వైద్యాధికారులకు చిక్కకుండా తప్పించుకున్నారు. వారిని మేనేజ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే డాక్టర్ నమ్రత తన చేతివాటం ద్వారా పోలీసులను మేనేజ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. బాధితులు మళ్లీ అదే పోలీస్ స్టేషన్ వెళితే ట్రీట్మెంట్ లో తేడా ఉండేదని తెలుస్తోంది. అంటే ఫిర్యాదు చేసిన దంపతులు మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళితే వారి గౌరవానికి భంగం కలిగించే విధంగా అధికారులు వ్యవహరించినట్టు ఆరోపణలున్నాయి. కరోనా, లాక్ డౌన్ నుంచి ఆమెపై ఫిర్యాదు చేసేవారి సంఖ్య తగ్గింది అని ఈడీ విచారణలో తేలింది. 2019, 2020లో సృష్టి సెంటర్ మీద ఇంటర్ నెట్ లో పాజిటివ్ ప్రచారం జరిగింది. దీంతో ఎక్కువ మంది దంపతులు సృష్టిని ఆశ్రయించారు.
ఐవిఎఫ్ విధానంలో భార్య నుంచి అండం, భర్త నుంచి వీర్యం సేకరించి తిరిగి భార్య గర్బంలో పిండాన్ని అభివృద్ది చేయాలి. కానీ డాక్టర్ నమ్రత అవేవీ చేయకుండానే సరోగసీకి పురమాయించేది. ఎవరికో పుట్టిన బిడ్డను పిల్లలను లేని దంపతులకు పుట్టినట్లుగా బుకాయించేవారు. డాక్టర్ నమ్రతకు ప్రభుత్వ వైద్యులు సదానందం, విద్యుల్లతలు సహకరించారు. వారిని అడ్డం పెట్టుకుని నమ్రత అక్రమాలకు పాల్పడింది.
Tags:    

Similar News