‘ ఘోష్ కమిషన్ నివేదిక నీరుగారుతోంది'

ముఖ్యమంత్రి రేవంత్ కు బీఎస్ రాములు లేఖ. అనేక అంశాలపై సూచనలు, విమర్శలు.;

Update: 2025-08-06 08:04 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా, ఆయన ప్రభుత్వం సమిష్టింగా విస్మరించిన అనేక విషయాల మీద ప్రముఖ రచయిత,  రాష్ట్ర బీసీ కమిషన్ తొలి ఛైర్మన్ బీఎస్ రాములు ఒక లేఖ రాశారు. అనేక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ప్రభుత్వం కొన్నిముఖ్యమయిన అంశాల మీద పట్టీ పట్టనట్లు ఉండటాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక లీకుల వల్ల నష్టజరుగుతున్నదనే విషయం నుంచి  రాష్ట్రంలో ఉత్తరాంధ్ర రైతుల అరిగోస వరకు అన్ని అంశాలను ఆయన లేవనెత్తారు. కాంగ్రెస్ పాలనలోని పలు లోపాలను కూడా ఆయన ఎత్తి చూపారు. ఒకవైపు ప్రభుత్వానికి సూచనలు చేస్తూ మరోవైపు నిలదీశారు. ఉత్తర తెలంగాణ రైతులపై పగబట్టారా? అని ఆయన సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.

బీఎస్ రాములు లేఖలోని అంశాలివే..

1. ‘‘కాళేశ్వరం కమిషన్ నివేదికను లీకుల రూపంలో రోజుకొక ఎపిసోడ్‌లా విడుదల చేయడం వల్ల నిందితులను , దోషులను , వారి అనుచరులు అలెర్ట్ అవుతారు. ఇలా చేయడం ద్వారా నివేదికకు వ్యతిరేకంగా జన సమీకరణ చేయడానికి , ఉద్యమించడానికి వారికి ప్రభుత్వమే అవకాశం ఇస్తోంది. నివేదిక అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలి. దానిని లీకుల రూపంలో విడుదల చేస్తూ నివేదికను ప్రభుత్వమే నీరు గార్చింది. బాద్యులపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల నివేదికకు వ్యతిరేకంగా ఉద్యమాలకు తావిస్తోంది’’ అని రాములు అభిప్రాయపడ్డారు.

2. ‘‘నీళ్లు లేక, పంటలు లేక ఉత్తర తెలంగాణ రైతాంగం రూ.వేల కోట్లు నష్టపోతున్నది. ప్రభుత్వానికి ఈ సమస్య ఏమాత్రం పట్టడం లేదు. ఉత్తర తెలంగాణ రైతాంగం మీద పగ బట్టారా? బీఆర్‌ఎస్ నాయకుల మీద ఆగ్రహానికి ఉత్తర తెలంగాణ ప్రజల మీద , సాగు నీరివ్వక ప్రతీకారం తీసుకుంటారా?’’ అని ప్రశ్రించారు.

3. చాలా విచిత్రమైన విషయం ఏమంటే మంత్రులకు, ప్రభుత్వానికి ఇది పట్టించుకోవాల్సిన, వెంటనే పరిష్కరించాల్సిన, రిపేర్ చేసి నీళ్లు అందించి పొలాలను సస్యశ్యామలం చేయాల్సిన సమస్యగా కనపడకప పోవడమని ఆయన పేర్కొన్నారు.

4. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన , తెచ్చిన ఫీలింగే లేకుండా పోయిందని అన్నారు.

5. కేవలం కాంగ్రెస్ రాజకీయాల సంస్కృతి, చర్చలు తప్ప తెలంగాణ ఉద్యమ స్వభావం, స్పూర్తి , తెలంగాణ పునర్నిర్మాణం ఉత్తేజం ఎక్కడా కవపడడం లేదని పేర్కొన్నారు.

6. ‘‘గత ప్రభుత్వంలో 40 శాతం దాక ఉద్యమకారులను ప్రభుత్వంలో భాగ స్వాములను చేశారు. 60 శాతం ఉద్యమకారులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుండా పోయింది. అందులో కొందరికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకాశం దక్కుంతనుకుంటే.. అలా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల్లో కొందరిని పక్కనబెట్టారు. ఉద్యోగులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ విధానాలను అమలుచేస్తారు. ఉద్యమకారులు కూడా అంతే. ప్రజలకు సేవలు అందించడం వారి లక్ష్యం తప్ప పార్టీలు కాదు’’ అని గుర్తు చేశారు.

7. ఉద్యమం పేరుతో దోచుకున్నవారు ఇప్పుడు మళ్ళీ ఉద్యమ స్పూర్తి , పునర్నిర్మాణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

8. ఉద్యమ కారులకు ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కపోవడం, అప్పట్లో ఇచ్చిన కొన్ని హామీలు అమలు చేయకపోవడం ఉద్యమాలను అవమానించినట్లేనని బీఎస్ రాములు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని రేవంత్‌కు గుర్తు చేస్తూ బీఎస్ రాములు హెచ్చరించారు.

9. బీఆర్ఎస్ హాయంలో దెబ్బతిన్న తెలంగాణ పునఃనిర్మాణ విషయంపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కీచులాటలకే పరిమితం అవుతోందని రాములు మండిపడ్డారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జీ వివేక్ వ్యవహారాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

10. సామాజిక తెలంగాణ సాధనను ఆశించవచ్చా? అని రేవంత్‌ను రాములు సూటిగా ప్రశ్నించారు.

Tags:    

Similar News