వరదల్లో 10 మంది చనిపోయారు: రాష్ట్ర డిజిపి
1200 మంది ప్రాణాలను కాపాడాము;
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసుశాఖ సహాయకచర్యల్లో నిమగ్నమైనట్టు తెలంగాణ డిజిపి( Telangana DGP) జితేందర్ రెడ్డి చెప్పారు వరదల్లో ఇప్పటివరకు 10 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని డీజీపీ తెలిపారు. ఇప్పటి వరకు 2వేల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు, 1,200 మంది ప్రాణాలను రక్షించినట్టు డిజిపి చెప్పారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ,హెలికాప్టర్, ఆర్మీ సాయంతో వరదల నుంచి రక్షించామని ఆయన తెలిపారు2వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF)ను ఏర్పాటు చేశాం అని, ఎస్డీఆర్‌ఎఫ్(NDRF) సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్టు డిజిపి చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ పనిచేస్తున్నాయని,ఇంత భారీ వర్షం కురిసినా ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ చేస్తున్నాం అని డీజీపీ తెలిపారు.ఒకవైపు గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో వరదల్లో పోరాటం చేస్తున్నాం అని , గతేడాది నుంచి ఎస్డీఆర్‌ఎఫ్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయి అని డీజీపీ చెప్పారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నాం అని,హైదరాబాద్‌లో భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ పేర్కొన్నారు.కామారెడ్డి, సిద్దిపేటలో ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయని, మెదక్ జిల్లాలో రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసమైంది పోలీసు బాసు తెలిపారు.
జనజీవనం అస్తవ్యస్థం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు నిన్ననే సర్కార్ ప్రకటించింన సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అగచాట్లు పడుతున్నారు. దీంతో అత్యవసరమైతే తప్ప బయకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అయితే గురువారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిగా వచ్చే నెల రెండో శనివారం స్కూల్స్ నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. భారీవర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లిన తర్వాత అధికారులు సెలవు ప్రకటిండంతో విద్యార్థులు ఇళ్లకు చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. విద్యార్థులు తడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఏకధాటి వర్షం కురుస్తుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు సైతం తెగిపోపోయి రోడ్లపై పడ్డాయి. భీంపూర్, తాంసి మండలాల్లోని 50 గ్రామాలకు బుధవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీవర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యల్లో తలామునకలయ్యారు.వరద ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదల వల్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.అవసరమైతేతప్ప బయటకు రావొద్దంటూ అధికారులు సూచించారు.