కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ డ్యామ్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా అక్కడకు వెళ్లిన యువకుల సెల్ఫీ సరదా వారిని మృత్యువులా కమ్మేసింది.;

Update: 2025-01-11 11:56 GMT

సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ డ్యామ్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా అక్కడకు వెళ్లిన యువకులు సెల్ఫీ దిగుదామనుకున్నారు. ఆ సెల్ఫీ సరదానే వారికి మృత్యువులా కమ్మేసింది. సెల్ఫీ దిగుదామని దిగిన యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఐదుగురు యువతకులు మరణించగా, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మృతులను హైదరాబాద్‌కు చెందని వారిగా గుర్తించారు. వారు 1) ధనుష్ (20)- ముషీరాబాద్, 2) లోహిత్ (17)-ముషీరాబాద్, 3) దినేశ్వర్ (17)-కవాడిగూడ, 4) జతిన్ (17)-ఖైరతాబాద్, 5) శ్రీనివాస్ (17)-రాంనగర్‌గా గుర్తించారు. కాగా మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. అదే విధంగా అసలు డ్యామ్ వద్ద్ ఏం జరిగింది అనేది కూడా మిగిలిన ఇద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై సీఎం సహా పలువరు కీలక రాజకీయ నాయకులు స్పందించారు. ఈ ఘటన తమను ఎంతో కలచివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం దిగ్బ్రాంతి

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సిద్ధిపేట జిల్లా…కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో గల్లంతై…ఐదుగురు యువకులు దుర్మరణం పాలుకావడం దిగ్భ్రాంతికి గురి చేసింది. తక్షణం ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని…గల్లంతైన వారి కాపాడేందుకు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించాను. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఎక్స్‌గ్రేషియా అందించాలి: హరీష్ రావు

‘‘సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ లో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడం బాధాకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందటం నా మనస్సును కలిచి వేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కవిత

కొండపోచమ్మ సాగర్ లో గల్లంతై హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ‘‘మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు జలాశయాల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలి’’ అని ప్రభుత్వానికి సూచించారు కవిత.

Tags:    

Similar News