ఎస్ఎల్‌బీసీ ప్రమాదం.. ఆ ఎనిమిది మంది ఏమయ్యారు?
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ, రెస్క్యూ టీమ్ సహాయం కూడా కోరినట్లు అధికారులు తెలిపారు.;
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టన్నెల్ పైకప్పు కూలిపోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మూడు మీటర్ల మేరా టన్నెల్ పైకప్పు కూలింది. ఈ ప్రమాదం జరిగి ఎనిమిది గంటలు అవుతుంది. ఇంకా ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. సొరంగం శిథిలాల్లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ.. వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి స్థితిగతులపై ఎటువంటి అప్‌డేట్ రాలేదు. ప్రమాదంలో ఇరుక్కున్నవారిలో ఆరుగురు కూలీలు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. వారంతా కూడా బురదలో చిక్కుకున్నట్లు మాత్రం ఇప్పటి వరకు తెలిసింది. దీంతో వారికి రక్షించడానికి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ ప్రయత్నాన్ని ఆచరణలో పెడుతూ ఇరుక్కున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ, రెస్క్యూ టీమ్ సహాయం కూడా కోరినట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో పని మొదలు పెట్టగా.. మట్టి, నీరు వచ్చి చేరిందని, అది 8మీటర్ల వరకు చేరిందని అధికారులు చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో ఇక్కుకున్న ఇద్దరు ఇంజనీర్లు అమెరికా కంపెనీకి చెందిన వారిగా తెలుస్తోంది. కార్మికులు వచ్చేసరికి జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన రాబిన్స్ కంపెనీ ఉద్యగులు అమెరికన్లా? భారతీయులా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.