ఇద్దరం ఒకటే అనుకున్నారు.. కట్ చేస్తే హత్య చేసి ముక్కలుగా నరికి..

డబ్బు కోసమే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు.

Update: 2025-10-10 12:40 GMT

తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. ఇద్దరం ఒకటే అనుకున్న ఇద్దరు వ్యక్తుల కథ.. అతి కిరాతకమైన హత్యగా ముగిసింది. తన పార్ట్‌నర్‌ని హత్య చేసి.. శరీరాన్న ముక్కలుగా నరికిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన అశోక్‌ అనే వ్యక్తికి ఇటీవల వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పరిచయం అయింది. అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో వారి పరిచయం స్నేహంగా మారింది. కొంతకాలానికి ఆ స్నేహం మరో అడుగు ముందుకెళ్లింది. తామిద్దరం స్వలింగ సంపర్కకులం అని తెలుసుకున్న వారు.. ఇక రెచ్చిపోయారు. అశ్లీల కార్యకలాపాలను కొనసాగించారు. అయితే వీళ్లు కలిసిన ప్రతిసారి వెంకటేశ్వర్లు.. అశోక్‌కి కొంత డబ్బు ఇచ్చేవాడు. అలా పలుసార్లు చూసి అశోక్.. వెంకటేశ్వర్లు దగ్గర బాగా డబ్బు ఉందని అనుకున్నాడు. ఆ తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు.

అంతే ఆ డబ్బు కోసం ఏమైనా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఓ మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేశాడు. వెంకటేశ్వర్లును హత్యచేసి అతడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకోవాలని తన ఫ్రెండ్‌తో కలిసి ప్లాన్ రెడీ చేశాడు. అందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి సెప్టెంబర్ 16న ఆ ఛాన్స్ దొరకింది. వెంకటేశ్వర్లు నిద్రలో ఉన్న సమయంలో అశోక్, అతని స్నేహితుడు కృష్ణయ్య కలిసి వెంకటేశ్వర్లును తల నరికి హతమార్చారు. అంతేకాకుండా అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని కవర్లలో కట్టి వేరే వేరే ప్రాంతాల్లో పడేశారు. వెంకటేశ్వర్లు దగ్గర ఉన్న మూడు తులాల బంగారాన్ని తీసుకున్నారు. అతని యూపీఐ నుంచి డబ్బులను కూడా తీసుకున్నారు.

ఈ ఘటన మొత్తంలో అశోక్, కృష్ణయ్యకు నగ్మ అనే మహిళ సహాయం చేసింది. ఈ కేసులో అసలు ఆమె పాత్ర ఏంటి? ఆమె ఎవరు? నిందితులకు ఆమెకు సంబంధం ఏంటి? అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా దర్యాప్తు సమయంలో బాధితుడి తల, శరీర భాగాలు లభ్యం కావడంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఫోన్ పే నుంచి చివరి సారిగా అశోక్‌కు డబ్బులు బదిలీ అవ్వడాన్ని గమనించిన పోలీసులు.. అశోక్‌ను అరెస్ట్ చేసి విచారించారు. దీంతో అశోక్.. అసలు విషయం చెప్పాడు. తాము హత్య చేశామని నేరాన్ని అంగీకరించారు. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టడం కోసం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News