కార్ల స్మగ్లర్ తో కేటీఆర్ కు లింకులు ?
లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు(Cars Smuggling) బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లలో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు ? అంటు నిలదీశాడు.
కల్వకుంట్ల కుటుంబానికి ఇపుడు చాలా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. సమస్యలన్నీ ఒక్కోటిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికి ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా తాజాగా కార్ల స్మగ్లింగ్ ఆరోపణలు కేటీఆర్(KTR)ను కమ్ముకుంటున్నది. ఈ ఆరోపణను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేయటం గమనార్హం. ‘‘కారుపార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తోందా’’ ? అంటు బండి చేసిన ట్వీట్ రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. తన ట్వీట్లో కేటీఆర్ ను ఉద్దేశించి బండి కొన్ని ప్రశ్నలు సంధించారు. లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు(Cars Smuggling) బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లలో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు ? అంటు నిలదీశాడు.
ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి ?
కార్లకు మార్కెట్ ధర చెల్లించారా ? లేకపోతే ధర తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా ?
పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా ? నకిలీ ఆదాయమా ? లేకపోతే మనీల్యాండరింగ్ ద్వారా జరిగిందా ?
ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా ?
వాస్తవాలు బయటకు రావాలి, సంబంధిత శాఖలు విచారణ చేయాలని బండి డిమాండ్ చేశారు.
బండి ఆరోపణల వివరాలు తెలియాలంటే మనంకొంతకాలం వెనక్కు రావాలి. 2025, మే 13 సమాచారం ప్రకారం నిఘావర్గాల సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యు ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ ను ఛేదించింది. ఈ ముఠా ఏమిచేస్తోందంటే విదేశాల్లోని లగ్జకీ కార్లను అక్రమపద్దతిలో ఇండియాలోకి దిగుమతి చేస్తోంది. విదేశాల నుండి ఇండియాలోకి కారును చట్టబద్దంగా దిగుమతి చేసుకోవాలంటే కారు ఖరీదు మీద సుమారు 200-300 శాతం పన్ను కట్టాల్సుంటుంది. కోట్లరూపాయల పన్నులు కట్టేట్లయితే ఇక స్మగ్లర్లకు లాభాలు ఏముంటాయి ? అందుకనే అక్రమపద్దతిలో దిగుమతులు చేస్తుంటారు. అదేలాగంటే తాము ఏ దేశంనుండి అయితే కారును కొన్నారో అక్కడినుండి నేరుగా ఇండియాకు కారును తీసుకురారు. తాము కారు కొన్నదేశం నుండి అమెరికా, జపాన్, దుబాయ్, శ్రీలంక ఏదో దేశంలోకి తెచ్చుకుంటారు.
కారును దిగుమతి చేసుకున్న దేశంలోనే కారులో మార్పులు చేయిస్తారు. తర్వాత ఆ దేశంనుండి ఇండియాలోకి సెకెంట్ హ్యాండ్ కారు పద్దతిలో దిగుమతి చేయించుకుంటారు. దీనివల్ల కట్టాల్సిన పన్నులు చాలావరకు తగ్గిపోతాయి. నిజానికి కారు కొత్తదే అయినా చేసిన మార్పుల వల్ల కొత్తకారు కాస్త సెకెండ్ హ్యాండ్ కారుగా మారిపోతుంది. స్మగ్లింగ్ ముఠా ఏళ్ళ తరబడి విదేశాలనుండి హమ్మర్ ఈవీ, క్యాడిలాక్, ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ లాంటి 30 రకాల కార్లు ఇండియాలోకి దిగుమతి అవుతున్నాయి. ముఠాలోని వ్యక్తుల్లో చాలామందికి రాజకీయంగా బలమైన నేపధ్యమున్నవారే. హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగుళూరు, ఢిల్లీ నుండి ముఠా సభ్యులు ఆపరేట్ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. పట్టుబడేనాటికే ఈ ముఠా సుమారు రు. 25 కోట్ల పన్నును ఎగవేసినట్లు తెలిసింది.
డీఆర్ఐ జరిపిన దాడుల్లో కొన్ని కార్లు పట్టుబడటమే కాకుండా ముఠాలోని ఒక వ్యక్తి కూడా పట్టుబడ్డాడు. అతనిని విచారిస్తే హైదరాబాదుకు చెందిన బసారత్ ఖాన్ గా తెలిసింది. బసారత్ అప్పటికే లగ్జరీ 8 కార్లను దిగుమతి చేసుకున్నాడు. 8 కార్లకు కట్టాల్సిన పన్నులో బసారత్ రు. 7 కోట్లు ఎగ్గొట్టినట్లు డీఆర్ఐ గుర్తించింది. బసారత్ నుండి కార్లను కొనుగోలుచేసిన వారి వివరాలు తెలుసుకుని డీఆర్ఐ నిఘాపెట్టింది. తాను దిగుమతి చేసుకున్న 8 కార్లను ఎవరెవరికి అందించాడు అనే సమాచారాన్ని బసారత్ విచారణలో బయటపెట్టాడని తెలిసింది. అలా దిగుమతి చేసుకున్న 8 కార్లలో ఒక కారుపైనే ఇపుడు బండి సంజయ్ ఆరోపణలు చేసింది.
బండి ఆరోపించిన కారు ఎట్ హోం హాస్పిటాలిటి సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్ధ కొనుగోలు చేసిందని అంటున్నారు. టీఎస్09డీ 6666 నెంబర్ కారును సంస్ధ డైరెక్టర్ హోదాలో కల్వకుంట్ల శైలిమ ఉపయోగిస్తున్నట్లు బండి చెప్పారు. కల్వకుంట్ల శైలిమ ఎవరంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భార్య. ఈ సంస్ధగురించి గూగుల్ లో వెతికితే పాస్ట్ డైరక్టర్ల జాబితాలో కల్వకుంట్ల శైలిమతో పాటు కల్వకుంట్ల తారకరామారావు, జోగినపల్లి సంతోష్ కుమార్ పేరు కూడా కనబడుతోంది. కేటీఆర్, సంతోష్ పదవీకాలం 2014-10-04కు అయిపోయినట్లు కనబడుతోంది. శైలిమది పదవీకాలం 2021-11-26 వరకు ఉన్నట్లు చూపిస్తోంది. అలాగే కరెంట్ డైరెక్టర్స్ అనే మరో జాబితాలో శైలిమ పేరు పక్కన డైరెక్టర్, 2021-11-26 వరకు ఉన్నట్లు చూపుతోంది. ఈ జాబితాలో కేటీఆర్, సంతోష్ పేర్లులేవు. బండి తాజాగా ట్విట్టర్ లో చేసిన ఆరోపణలు వాస్తవమా ? కాదా అన్న విషయమై కేటీఆరే క్లారిటి ఇవ్వాలి.