మెగా బంధానికి స్వస్తి! ప‌తాక‌స్థాయికి మెగా అల్లు గొడవ

"హరిహర వీరమల్లు" చిత్రానికి పోటీగా `మహావతార్‌`;

Update: 2025-07-16 13:27 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగిన చిరంజీవి ఎక్కడుంటే.. అల్లు అరవింద్ అక్కడుండే వారు. మెగా ఫ్యామిలీలో ఏ పార్టీ లేదా ఏ చిన్న సెలబ్రేషన్స్ జరిగినా.. కచ్చితంగా అల్లు వారి ఫ్యామిలీ రావాల్సిందే. కానీ, ఇటీవల కాలంలో ఆ సీన్ కనిపించడం లేదు. గ‌త కొద్ది కాలంగా కానీ సీన్ మారింది. పైకి అంతా బాగానే ఉన్నా.. లోలోపల మాత్రం ఇరు కుటుంబాల మ‌ధ్య అంతర్యుద్ధం సాగుతోంది.

Full View

ఇరు ఫ్యామిలీలు తగ్గేదేలే అన్నట్టు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇన్నాళ్లూ తెలుగు సినిమా పరిశ్రమలో మెగా - అల్లు ఫ్యామిలీలను వేర్వేరుగా ఎన్న‌డు చూడలేదు. కానీ ఇప్పుడు లెక్క‌లు మారాయి. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే.. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఇరు కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది? మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది.

పుష్ప-2 సినిమా ప‌ట్ల మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ వ్య‌వ‌హ‌రించిన తీరును అల్లు అర్జున్ మ‌రిచిపోలేక‌పోతున్నారట‌.అందుకే హరిహర వీరమల్లు విడుద‌ల టైం కు త‌గ్గేదే లే అంటూ పోటీగా  గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మహావతార్‌ నరసింహ సినిమా విడుద‌ల చేస్తున్నారు. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించిన `మహావతార్‌ నరసింహ` చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తుంది.

హోంబలే ఫిలింస్ గతంలో కాంతారా, కేజీఎఫ్, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. హోంబలే ఫిలింస్ నిర్మించిన "మహావతార్‌ నరసింహ" చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల (జూలై) 25న విడుదల చేస్తున్నారు. `మహావతార్‌ నరసింహ` చిత్రాన్ని త్రీడీ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యానిమేషన్ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రధానంగా యానిమేషన్‌తో తెరకెక్కింది. విష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతారం, దాని పురాణ కథ ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. కాంతారా సినిమా అయితే డ‌బ్బుల వ‌ర్షం కురిపించింద‌నే చెప్పాలి. అయితే మెగా హీరో సినిమా విడుద‌ల అయ్యే స‌మ‌యంలోనే ఈ సినిమా విడుద‌ల చేయ‌డం  మెగా ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

ఇది పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రానికి పోటీగా రాబోతోంది.  ఎందుకంటే "హరిహర వీరమల్లు" జూలై 24న విడుదల కానుంది. అంటే రెండు భారీ చిత్రాలు ఒక రోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన "హరిహర వీరమల్లు" చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలవుతోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. "హరిహర వీరమల్లు" చిత్రానికి పోటీగానే మహావతార్‌ సినిమాను రిలీజ్ చేస్తున్నారని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి ఈ రెండు భారీ సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తాయో, అల్లు, మెగా ఫ్యాన్స్ మ‌ధ్య ఎంత ర‌చ్చ జ‌రుగుతుందో ఆస‌క్తి క‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News