ఎసిబి వలలో మరో అవినీతి చేప

బదిలీకి 50 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ రాజ్ చీఫ్ ఇంజినీర్;

Update: 2025-07-16 12:11 GMT

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు పదవీరమణ పొందిన పంచాయతీ రాజ్ చీఫ్ ఇంజినీర్ కి మరో ఏడాది పొడగించడంతో స్వంత శాఖలోనే అవినీతికి పాల్పడుతూ ఎసిబికి చిక్కారు. తెలంగాణ పంచాయతీ రాజ్ లో ఇంజినీర్ చీఫ్ హోదాలో ఉన్న కనకరత్నం అదే డిపార్ట్ మెంట్ కు చెందిన ఉద్యోగులను లంచాల కోసం వేధిస్తున్నారు. తాండూరుకు చెందిన డిఈ వికారాబాద్ కు బదిలీ చేయాలని కోరారు.కాసులకు కక్కుర్తిపడ్డ కనకరత్నం 50 వేలు లంచం ఇవ్వాలని డిమండ్ చేశారు. లంచం ఇవ్వడానికి అంగీకరించిన డిఈ ఎసిబి అధికారులకు సమాచారమిచ్చారు. డిఈ నుంచి కనకరత్నం లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యాలయంతో బాటు ఆయన నివాసమున్న కెపిహెబి కాలనీలో సోదాలు చేస్తున్నారు.

Tags:    

Similar News