ED Inquiry|ప్లాన్ ప్రకారమే ఈడీని అవాయిడ్ చేస్తున్నారా ?

8,9 తేదీల్లో కూడా వీళ్ళిద్దరు విచారణకు గైర్హాజరైతే అప్పుడు ఈడీ ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది.;

Update: 2025-01-03 07:36 GMT
ED inquiry

జరుగుతున్నది చూస్తున్నవాళ్ళకి ఈ విషయం అర్ధమైపోతోంది. 2వ తేదీన విచారణకు రమ్మని ముందుగానే నోటీసులు ఇస్తే చివరినిముషంలో మరో 3 వారాల సమయం కావాలని మెయిల్ ద్వారా కబురుపంపటం ఏమిటి ? అలాగే 3వ తేదీన విచారణకు హాజరుకావాల్సిన మరో సీనియర్ అధికారి కూడా విచారణకు హాజరవ్వటానికి మరింతగడువు కావాలని అడిగటంతోనే కూడబలుక్కునే ఈడీ విచారణ(ED Inquiry)ను అవాయిడ్ చేస్తున్నారని అర్ధమైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) అవినీతిపై 2వ తేదీన ఈడీ ముందుకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరవ్వాల్సింది. అయితే తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు. విచారణకు హాజరయ్యుందుకు తనకు 3 వారాల సమయం అవసరమని కూడా కోరారు. అయితే ఈడీ అంతసమయం ఇవ్వకుండా ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని సమాధానమిచ్చింది.

ఇక 3వ తేదీన అంటే శుక్రవారం విచారణకు రావాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కూడా మాజీ చీఫ్ ఇంజనీర్ బాటలోనే నడిచారు. తాను విచారణకు హాజరుకాలేనని తనకు కూడా గడువుకావాలని మెయిల్ ద్వారా కోరారు. అయితే కోరినంత సమయం ఇవ్వలేనని చెప్పిన ఈడీ జాయింట్ డైరెక్టర్ అర్వింద్ ను 9వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిందే అని సమాధానం ఇచ్చారు. మరి 8,9 తేదీల్లో కూడా వీళ్ళిద్దరు విచారణకు గైర్హాజరైతే అప్పుడు ఈడీ ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇదేసమయంలో 7వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) ఏమిచేయబోతున్నారు ? అన్నదే ఇపుడు అర్ధంకావటంలేదు. నేరుగా కేటీఆర్ ను విచారించటం కన్నా ముందు అవినీతిలో కీలకపాత్ర పోషించిన రెడ్డి, అర్వింద్ ను విచారించాలని ఈడీ నిర్ణయించటం మంచి ఆలోచనే.

అందుకనే విచారణతేదీలను ముందుగా రెడ్డి, అర్వింద్ కి ఈడీ కేటాయించింది. విచారణలో వీళ్ళిద్దరు చెప్పిన సమాచారాన్ని క్రాస్ చెకింగ్ పద్దతిలో 7వ తేదీ కేటీఆర్ ను విచారించాలని ఈడీ డిసైడ్ అయ్యింది. అయితే ఈడీ ప్లాన్ ప్రాక్టికల్ గా వర్కవుట్ కాలేదు. మారినపరిస్ధితుల్లో ముందు కేటీఆర్ నే ఈడీ విచారించబోతోంది. అదికూడా కేటీఆర్ విచారణకు హాజరయితేనే. ఇద్దరు అధికారులే ఈడీ నోటీసులను ఇంతతేలిగ్గా తీసుకుంటే ఇక మంత్రిగా పనిచేసిన కేసీఆర్(KCR) కొడుకు కేటీఆర్ విషయంలో చెప్పేదేముంటుంది ? పైగా ఈడీ విచారణగురించి మీడియా ప్రస్తావిస్తే ఆవిషయాన్ని తనలాయర్ చూసుకుంటారని బదులిచ్చారు. మీడియా అడిగిన ప్రశ్న ఒకటైతే కేటీఆర్ సమాధానం మరొకటి. ఈడీ విచారణ విషయాన్ని తనలాయర్ చూసుకుంటారని కేటీఆర్ చెప్పిన సమాధానానికి అర్ధమేంటి ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెడ్డి, అర్వింద్ ఇద్దరూ ఈడీ విచారణను ప్లాన్ ప్రకారమే అవాయిడ్ చేశారు. మరి రెండోసారి కూడా విచారణకు హాజరుకాకపోతే వీళ్ళపైన ఈడీ ఏమి యాక్షన్ తీసుకుంటుంది ? అన్నది చూడాలి. రెడ్డి విషయాన్ని పక్కనపెట్టేస్తే అర్వింద్ మీద డైరెక్టుగా తనంతట తాను ఈడీ యాక్షన్ తీసుకునే అవకాశాలు దాదాపు లేవు. అర్వింద్ సీనియర్ ఐఏఎస్ అధికారి కావటంవల్ల ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ముందు చీఫ్ సెక్రటరీకి చెప్పాలి తర్వాత డీవోపీటీ అనుమతి తప్పనిసరి. కాబట్టి అర్వింద్ మీద యాక్షన్ తీసుకోవాలంటే ప్రభుత్వంతో మాట్లాడాల్సిందే. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ చేసిన అంతర్గత విచారణలో కార్ రేసు వ్యవహారంలో ఏమి జరిగిందనే విషయాన్ని అర్వింద్ రాతమూలకంగా వాగ్మూలమిచ్చేశారు. దానిప్రకారమే అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకుని కేసులుపెట్టింది. కేటీఆర్, అర్వింద్, బీఎల్ఎన్ రెడ్డి మీద ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఎఫ్ఐఆర్ ఆధారంగానే ముగ్గురిపైన ఈడీ మనీల్యాండరింగ్, ఫారెన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) కేసులు నమోదుచేసింది.

ఆధారాలు లేకుండా కేసులు నమోదుచేస్తే కోర్టుల్లో వీగిపోతుందని ఈడీకి బాగా తెలుసు. అందుకనే ముగ్గురిపైనా సాక్ష్యధారాలు దగ్గరపెట్టుకుని కేసులు నమోదుచేసింది. అయితే ఈడీవిచారణలో కొత్తవిషయాలు ఇంకేమి వెలుగుచూస్తాయో తెలీదు. యాక్షన్ తీసుకునే విషయంలో అర్వింద్ కున్న సౌలభ్యం రెడ్డికి లేదు. బీఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు కాబట్టి డైరెక్టుగా ఈడీ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళమీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్నది 7వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరయ్యే విషయంమీద ఆధారపడుంది. మరి ఆరోజు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News