మాధవీలతని ఓడించేందుకు ఓవైసీ మాస్టర్ ప్లాన్
హైదరాబాద్ కుంభస్థలాన్ని కొడతా అని బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ధీమాగా చేస్తున్న ప్రకటన ఎంఐఎం నేతలను అలర్ట్ చేసింది.
హైదరాబాద్, ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి : మైనారిటీ ఓటర్లు అధికంగా గల హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బలమైన నేతను బరిలో దింపాలని తెలంగాణ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా కీలక ఎంబీటి నేతను పార్టీ లోకి ఆహ్వానించారు. రేవంత్ ఎత్తుగడతో ఎంఐఎం అంతర్మథనంలో పడింది.
మరొక వైపు హైదరాబాద్ కుంభస్థలాన్ని కొడతా అని బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ధీమాగా చేస్తున్న ప్రకటన ఎంహైదరాబాద్ కుంభస్థలాన్ని కొడతా అని బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ధీమాగా చేస్తున్న ప్రకటన ఎంఐఎం నేతలను అలర్ట్ చేసింది.ఐఎం నేతలను అలర్ట్ చేసింది. ఈ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ తో సయోధ్యే మంచిది అనే ఆలోచనలో ఎంఐఎం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి ఒక ప్రభుత్వ కారక్రమంలో ముఖ్య మంత్రిని పొగడటం, రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్య మంత్రిగా కొనసాగుతారని మద్దతు తెలిపారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
మొత్తం ఓటర్లలో 59 శాతం ముస్లింలు, ఒక్క శాతం లింగ్విస్టిక్ మైనారిటీస్ గల హైదరాబాద్ లోక్ సభ స్థానం ఎంఐఎం కు పెట్టని కోటగా చెప్పవచ్చు. 1984 నుంచి 1999 ఎన్నికల వరకు సలావుద్దీన్ ఒవైసి హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపి గా గెలిచారు. అయన తరువాత నుంచి ఇప్పటి వరకు అతని కుమారుడు అసదుద్దీన్ ఒవైసి అదే నియోజకవర్గం నుంచి ఎంపి గా గెలుస్తూ వచ్చారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం ను ఓడించటం అంటే హైదరాబాద్ చరిత్రను తిరిగిరాయటమే అని చెప్పవచ్చు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం లో ఎంఐఎం, బిజెపి, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోటీ అనివార్యం అయితే ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం ఉంది.
ముస్లిం ఓట్లు ఎంఐఎం, కాంగ్రెస్ ల మధ్య చీలి, తమ అభ్యర్థి మాధవిలత విజయానికి దారితీస్తుంది అని బిజెపి ధీమాగా ఉంది. మాధవీలతకు గల గుర్తింపు, వ్యక్తిగత పరిచయాలు, ఆర్ధిక బలం తమకు కలిసివచ్చే అంశాలని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ శాశన సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయని పలువురు బిజెపి నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ లో తమ పార్టీ అభ్యర్ధికి మద్దతు తెలిపితే మిగతా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సహరిస్తామని ఎంఐఎం నేత ముఖ్య మంత్రికి స్పష్టం చేసారని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలిసింది.
ఇలాంటి రాజకీయ పరిణామాలలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పై ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గం పై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ అధినేత నుంచి ఆదేశించినట్లు తెలిసింది.
ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాశన సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ పరిధి లోని గోషామహల్ స్థానాన్ని బిజెపి గెలుచుకోగా, యాకత్పుర లో ఎంబిటి కేవలం 878 ఓట్ల తేడా తో అపజయం పొందారు, నాంపల్లి స్థానంను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో, ఎంఐఎం హవా ఐదు నియోజవర్గాలలోనే సాగింది. ఇలా జరగటం ఇదే మొదటిసారి, ఇది ఎంఐఎం కు వార్నింగ్ సిగ్నల్ లాంటిదే అని గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కే లక్ష్మా రెడ్డి తెలిపారు.
బిజెపి మాధవీలత నే ఎందుకు ఎంపిక చేసింది?
ధనిక కుటుంబానికి చెందిన మాధవి లత ఓల్డ్ సిటీ లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసారు. బాలికల విద్యకు ఆర్ధిక సాయం అందిస్తూ, హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఓల్డ్ సిటీ ప్రజలలో మంచి గుర్తింపును పొందారు. తాను నడుపుతున్న విరించి హాస్పిటల్ లో ఓల్డ్ సిటీ కి చెందిన పేద మహిళలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.
హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మాధవీలత మాట్లాడుతూ "అసద్ భాయ్ .. నేను వస్తున్నా, చట్ట వ్యతిరేఖ పనులు చేస్తే ఊరుకునేది లేదు. పాత బస్తీలో ముస్లింలకు, హిందువులకు అసదుద్దీన్ న్యాయం చేయలేదు. అన్యాయంగా యవకులను జైళ్ళలో వేయిస్తున్నారు. నేను కుంభస్థలాన్నే కొడతా" అన్నారు.
హైదరాబాద్ లో పోటీ చేయడానికి మగాడే దొరక లేదా అని ప్రశ్నించిన గోషామహల్ ఎంఎల్ఏ రాజా సింగ్ కూడా మాట మార్చి "మాధవీ లతకి ఆమె చేసిన సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు ఉంది. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి తప్పకుండా విజయం సాధింస్తుంది" అన్నారు.
రానున్న కొద్ది రోజులలో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో అనూహ్య రాజకీయ మార్పులు జరగనున్నట్లు రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతుంది.