సిట్ ముందు బండి సంజయ్ వాంగ్మూలం

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ;

Update: 2025-07-17 09:28 GMT

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోడెవలప్ మెంట్ చోటు చేసుకుంది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ నెల 24న విచారణకు రావాలని సిట్ నోటీసులిచ్చింది. లేక్ వ్యూ అతిధి గృహంలో బండి సంజయ్ స్టేట్ మెంట్ ను సిట్ రికార్డు చేయనుంది. గత ఎన్నికల సమయంలో తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్టు ప్రతిపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దాదాపు 4. 500 ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ ఇప్పటికే వెల్లడించింది. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనూహ్యంగా బిజెపి నేతలు సిట్ విచారణకు హాజరవుతున్నారు. వారి స్టేట్ మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. వీరిలో బిజెపి ప్రముఖుల్లో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ తో బాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టేట్ మెంట్లను సిట్ రికార్డు చేసింది. 

Tags:    

Similar News