Komati Reddy | ‘నాకు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు’

తనకు మంత్రి పదవి రాకుండా రాష్ట్రంలోని ముఖ్యనేతలే అడ్డుకుంటున్నారని అన్నారు.;

Update: 2025-08-11 10:12 GMT

తనకు మంత్రి పదవి ఇప్పిస్తామని ఎవరు హామీ ఇచ్చారు అన్న అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తనకు మంత్రిపదవి విషయంలో హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆ హామీని పార్టీ అదిష్ఠానం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా రాష్ట్రంలోని ముఖ్యనేతలే అడ్డుకుంటున్నారని అన్నారు. తనకు మంత్రి పదవి హామీ అంశంలో వాస్తవాలను ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగానే తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని పునరుద్ఘాటించారు. ప్రజలకు అవినీతిరహిత పాలనను అందించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ సమాజం ఆకాంక్షలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

అయితే మంత్రి పదవి అంశంలో కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్‌యుద్ధం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి పలుసార్లు వ్యతిరేకించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా తన స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తీవ్ర చర్చలకు దారితీసింది. అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఆశ ఎవరు చూపారు? హామీ ఇచ్చింది ఎవరు? ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఇలా అనేక ప్రశ్నలు వెలుగుచూశాయి. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా అనేక చర్చలకు దారితీసింది.

రాజగోపాల్‌కు హామీ ఇచ్చిందెవరు..?

తనకు అప్పట్లో హామీఇచ్చినట్లే ఇపుడు మంత్రిపదవి ఇవ్వాల్సిందేనని రాజగోపాల్ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడే అందరిలోను ఒక అనుమానం మొదలైంది. మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చిన వాళ్ళమీద చూపించాల్సిన కోపాన్ని కోమటిరెడ్డి ముఖ్యమంత్రి మీద ఎందుకు చూపిస్తున్నారో అర్ధంకావటంలేదు. ఒకవేళ రేవంత్ ఏమన్నా ఎంఎల్ఏకి మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చారా అనే సందేహాలు మొదలయ్యాయి.

Tags:    

Similar News