39 STPలకు సీఎం శంకుస్థాపన
రూ.539.23 కోట్లతో నిర్మించిన ఎస్‌టీపీలు
హైదరాబాద్ అంబర్‌పేట్ వద్ద నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీటికి తోడు మురుగునీటి శుద్ధి కోసం రూ. 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు. రూ. 539.23 కోట్లతో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆరు STP ప్లాంట్లను ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి అంబర్‌పేట ఎస్టీపీని పరిశీలించారు.
ప్రారంభించిన ఎస్టీపీల వివరాలు:
1. అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో (రూ. 319.43 కోట్లు) 212.50 MLD సామర్థ్యం కలిగిన అంబర్‌పేట్ ఎస్టీపీ.
2. రాజేంద్రనగర్ పరిధిలో (రూ. 109.24 కోట్లు) నిర్మించిన 64 MLD సామర్థ్యం గల అత్తాపూర్ ఎస్టీపీ.
3. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో (రూ. 44.46 కోట్లు) నిర్మించిన 25 MLD సామర్థ్యం గల ముల్లకతువా ఎస్టీపీ.
4. కుత్బుల్లాపూర్ పరిధిలో (రూ. 34.13 కోట్లు) నిర్మించిన 14 MLD సామర్థ్యం గల శివాలయ నగర్ ఎస్టీపీ.
5. కుత్బుల్లాపూర్ పరిధిలో (రూ. 13 కోట్లు) నిర్మించిన 10 MLD సామర్థ్యం గల వెన్నలగడ్డ ఎస్టీపీ.
6. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో (రూ.18.97 కోట్లు) నిర్మించిన 07 MLD సామర్థ్యం గల పాలపిట్ట ఎస్టీపీ.
వీటికి తోడుగా మురుగునీటి శుద్ధి కోసం రూ. 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 STP లకు రేవంత్ శంకుస్థాపన చేశారు.
1. రూ. 1878.55 కోట్లతో ప్యాకేజీ-1 లో 16 ఎస్టీపీలు.
2. రూ. 1906.44 కోట్లతో ప్యాకేజీ-2 లో 22 ఎస్టీపీలు.
3. రూ. 64.11 కోట్లతో PPP మోడల్‌లో ఒక ఎస్టీపీ.