ముఖ్యమంత్రి స్వంత గ్రామం అరుదైన రికార్డు
సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా నిలిచింది
మరో అరుదైన రికార్డును స్వంతం చేసుకుంది ముఖ్యమంత్రి స్వంత గ్రామం. కొండారెడ్డి పల్లి గ్రామం అంటే తెలంగాణ వాసులకు చిరపరిచతమే. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలంలో కొండారెడ్డి పల్లి గ్రామం ఉంది. దక్షిణ భారత దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా కొండారెడ్డి పల్లి నిలిచింది.
తెలంగాణ గ్రీన్ ఎనర్జీ సంస్థ Tg redcoఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 10.53 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామంలోని 514 ఇళ్లకు , 11 ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
ప్రతీ ఇంటికి 3 kw సామర్ధ్యంతో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే ఇళ్లపైన సౌర విద్యుత్ పరికరాలు అమర్చనున్నట్టు Tg redco ఉమ్మడి మహ బూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల గ్రామంలోని ప్రతీ కుటుంబానికి ఉచితంగా సౌర విద్యుత్ ఏర్పాటు చేయడమే గాక పర్యావరణ హితంగా విద్యుత్ వినియోగించుకోవచ్చు.ఈ ప్రాజెక్టు విద్యుత్ కొరత తీర్చడమే గాక గ్రామస్థులకు ఆర్థికంగా దోహదపడుతుంది.కొండారెడ్డి పల్లి దేశంలోని ఇతర గ్రామాలకు ఆదర్శ గ్రామంగా నిలిచింది.